అచ్చెన్నతో ఆజన్మ వైరం…?

శ్రీకాకుళం జిల్లాలో కొందరి నేతల రాజకీయాలు ఇలాగే ఉంటాయి. అక్కడ కొందరు మాస్కులు వేసుకుని అధికారంలో ఉన్న పార్టీతో దోస్తీ చేస్తుంటారు. అవతల వారు మళ్ళీ అధికారంలోకి [more]

Update: 2021-04-15 03:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో కొందరి నేతల రాజకీయాలు ఇలాగే ఉంటాయి. అక్కడ కొందరు మాస్కులు వేసుకుని అధికారంలో ఉన్న పార్టీతో దోస్తీ చేస్తుంటారు. అవతల వారు మళ్ళీ అధికారంలోకి వస్తే వీరికి సాయం చేస్తూ ఆ బాకీ తీర్చేస్తారు. ఇలా సాగిపోతున్న రాజకీయాల్లో దూకుడు, ముక్కుసూటితనమే తప్ప మరేమీ తెలియని దువ్వాడ శ్రీనివాస్ ప్రవేశించారు. ఆయన మొదట‌ కాంగ్రెస్ లో ఉండేవారు. మైనింగ్ వ్యాపారంలో బాగానే ఆర్జిస్తూ బంగారంలా ఉండే దువ్వాడ కాంగ్రెస్ లో చేరాక కానీ అసలు సంగతి తెలియలేదు.

వెన్నుపోట్లే మరి …

అటు సొంత కాంగ్రెస్ పార్టీ, ఇటు విపక్ష తెలుగుదేశం నాయకులు అందరూ కలసి టార్గెట్ చేసి దువ్వాడ శ్రీనివాస్ ను ఇబ్బందుల పాలు చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడనుకున్న దువ్వాడ కేవలం వైఎస్ చైర్మన్ తోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. మరో వైపు చూస్తే 2009 ఎన్నికల నాటికి ప్రజరాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా, 2014, 2019ల్లో వైసీపీ నుంచి బరిలో దిగినా గెలుపు మాత్రం ఆయన పిలుపు వినలేదు. మొత్తానికి ఇన్నాళ్ళకు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఇది తనకు జగన్ ఇచ్చిన వరం అంటున్నారు.

అదే ఆయుధంగా…?

తాను జగన్ని నమ్మానని, జగన్ కూడా మాట మీద నిలబడి తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్ట సభల్లో అడుగుపెట్టేలా చేశారని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. తాను ఇంతకంటే మరేమీ కోరుకోనని కూడా ఆయన చెబుతున్నారు. ఇపుడు తన మీద ఎంతో బాధ్యత ఉందని కూడా అంటున్నారు టెక్కలిలో అచ్చెన్నాయుడుని ఓడించడమే తన టార్గెట్ అని కూడా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా దువ్వాడ శ్రీనివాస్ చెప్పేశారు. తాను టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ మీదటనే 2024లో వచ్చే ప్రభుత్వంలో మంత్రిని అవుతాను అని ఆయన ధీమాగానే చెబుతున్నారు. టెక్కలితో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లను కూడా గెలిపించి జగన్ కి గిఫ్ట్ ఇస్తామని కూడా అయన అంటున్నారు.

కసి ప్లస్ కృషి ….

దువ్వాడ శ్రీనివాస్ విషయం తీసుకుంటే ఆయన తనను రాజకీయంగా అణగదొక్కి తన వ్యాపారాలను విద్వంసం చేసిన వారి మీద కసితో ఉన్నారని అర్ధమవుతోంది. అలాగే తనను జైలు పాలు చేసిన వారి మీద కూడా ఆయన కత్తి కట్టారు రాజకీయంగానే ఇవన్నీ ఎదుర్కొంటానని అంటున్నారు. అంతే కాదు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడిని ఓడించి రాజకీయంగా ఆయన హవాకు ఫుల్ స్టాప్ పెడతామని కూడా చెబుతున్నారు. జగన్ కోరింది కూడా ఇదే. తనలాగే దేనికైనా తట్టుకునే దువ్వాడ శ్రీనివాస్ ను అందుకే ఆయన రెడీ చేసి మరీ అచ్చెన్నకు పోటీగా దింపారు. ఇపుడు దువ్వాడ శ్రీనివాస్ ఆ బాధ్యతను నూటిని నూరు శాతం నెరవేరుస్తాను అంటున్నారు. సో వైసీపీకి జగన్ కి ఇంకేం కావాలి.

Tags:    

Similar News