దువ్వాడపై అంత విషం చిమ్మడం ఎందుకో?
దువ్వాడ శ్రీనివాస్ పై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. ఆయన ఎమ్మెల్సీగా పనికి రారట. మండలిలో ఆయన వస్తే పెద్ద యుద్ధమే జరుగుతుందట. ఇటీవల జగన్ దువ్వాడ [more]
దువ్వాడ శ్రీనివాస్ పై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. ఆయన ఎమ్మెల్సీగా పనికి రారట. మండలిలో ఆయన వస్తే పెద్ద యుద్ధమే జరుగుతుందట. ఇటీవల జగన్ దువ్వాడ [more]
దువ్వాడ శ్రీనివాస్ పై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. ఆయన ఎమ్మెల్సీగా పనికి రారట. మండలిలో ఆయన వస్తే పెద్ద యుద్ధమే జరుగుతుందట. ఇటీవల జగన్ దువ్వాడ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుంచి దువ్వాడ శ్రీనివాస్ పై ఎల్లో మీడియాలో నెగిటివ్ వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఆయన ఓ రౌడీ గా చిత్రీకరిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఎల్లో మీడియాకు గతంలో చంద్రబాబు పదవులు ఇచ్చిన వారు పత్తిత్తులా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది.
విద్యావంతుడే కాదు.. వ్యాపారవేత్త కూడా…
దువ్వాడ శ్రీనివాస్ రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడూ వివాదాల ద్వారా వార్తల్లోకి ఎక్కలేదు. తన పని తాను చేసుకుపోయే నేత. అలాగే తనను నమ్ముకున్న వారి కోసం ఆస్తులు కూడా కరిగించుకున్నారన్నది శ్రీకాకుళం జిల్లా వాసులకు ఎవరికైనా తెలుసు. దువ్వాడ శ్రీనివాస్ ఉన్నత విద్యావంతుడు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. తర్వాత న్యాయవాది విద్యను కూడా అభ్యసించారు. అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా….
ఉన్నత విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా ఆయన రౌడీ అయితే వ్యాపారాలు ఎలా నడుస్తాయి. ఇక రాజకీయంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్, వైసీపీల్లో అచ్చెన్నాయుడు కుటుంబాన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆయన కొంత నోరు జారిన మాట వాస్తవమే. కానీ అచ్చెన్నాయుడు తమ పార్టీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని సూచించడంతోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు.
మరి బాబు ఇచ్చిన వారు పత్తిత్తులా?
చంద్రబాబు బ్యాంకులకు కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన వారిని రాజ్యసభకు ఎంపిక చేసిన వారి కంటే దువ్వాడ నయం. ఇక రాయలసీమకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్సీ అయితే హైదరాబాద్ లో 163 కోట్ల విలువైన భూ కబ్జాకు పాల్పడ్డారు. ఈయనగారు ఒక మాజీ ఎమ్మెల్యేకు అల్లుడే. ఈయన కంటే దువ్వాడ శ్రీనివాస్ బెటర్ కాదా? పెదబాబు, చినబాబు ఏం పీకుతారంటూ చేసే వ్యాఖ్యలు మాత్రం ఎల్లో మీడియాకు కమ్మగా ఉంటున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ శాసనమండలిలో అడుగుపెడితేనే ఏదో పెద్ద అపచారం జరిగిపోయినట్లు ప్రచారం చేస్తుంది ఎల్లో మీడియా. పెద్దల సభలో గద్దలా మారబోతున్నారంటూ కామెంట్స్ చేశారు. మరి దువ్వాడ పై వారికంటే చాలా బెటర్ కదా? అన్నీ అనుకూలిస్తే దువ్వాడ శ్రీనివాస్ మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఎంతో దూరంలో లేదు. ఇలాగే ఎల్లో మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ పై విషప్రచారం చేస్తుంటే ఆయనకు మంత్రి పదవి జగన్ ఇవ్వడం ఖాయం.