రాజ‌ధానిపై గోదావ‌రి త‌మ్ముళ్ల టాక్ ఇదే.?

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నంగా మారిన విష‌యం ఏపీ రాజ‌ధాని. దీనిపై తాజాగా అణు విస్ఫోటం లాంటి వార్తను అసెంబ్లీ సాక్షిగా పేల్చారు [more]

Update: 2019-12-21 08:00 GMT

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నంగా మారిన విష‌యం ఏపీ రాజ‌ధాని. దీనిపై తాజాగా అణు విస్ఫోటం లాంటి వార్తను అసెంబ్లీ సాక్షిగా పేల్చారు సీఎం జ‌గ‌న్‌. ఇప్పటి వ‌ర‌కు ఒకటే రాజ‌ధాని అని భావిస్తూ.. వ‌చ్చిన వారికి ఒక్కసారిగా భారీ ఎత్తున షాక్ ఇచ్చేలా ప్రక‌ట‌న చేశారు. ఇప్పటి కే జీఎన్ రావు క‌మిటీ రాజ‌ధాని ప‌రిస్థితులు, రాష్ట్ర ప‌రిస్థితుల‌పై పెద్ద ఎత్తున అభిప్రాయాలు సేక‌రిస్తున్నా రు. జిల్లాల్లో ప‌ర్యటిస్తున్నారు. అయితే, ఈ నివేదిక రాక‌ముందుగానే త‌న అభిప్రాయంగా తాజాగా మంగ‌ళ వారం నాటి అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల చివ‌రి రోజు జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

దీనిపైనే చర్చ….

అదే రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు. ఒక‌టి అమ‌రావ‌తిలో శాస‌న రాజ‌ధాని, క‌ర్నూలులో న్యాయ రాజధాని, విశాఖ‌లో పాల‌నా రాజ‌ధానిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇలా ఉంటే త‌ప్పేంట‌ని, ద‌క్షిణాఫ్రికాలో మూడు రాజ‌ధానులు ఉన్నాయ‌ని చెప్పారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉలిక్కి పడ్డాయి. ఇలా కూడా నిర్మాణాలు చేసుకోవ‌చ్చా ? అనే ఆలోచ‌న‌లో ప‌డిపోయింది. ఇప్పుడు అటు అనంత నుంచి ఇటు శ్రీకాకుళం వ‌ర‌కు ప్రతి ఒక్క‌రు దీని గురించే చ‌ర్చించుకుంటున్నారు.

తూ.గో జిల్లా నేతలు మాత్రం…..

ఇదిలా వుంటే, దీనిపై టీడీపీలోని ఉభ‌య గోదావ‌రి జిల్లాల నాయ‌కులు ఏమ‌నుకుంటున్నారు? అస‌లు టీడీపీ వాయిస్ ఎలా ఉంది? ఉభ‌య గోదావ‌రులు కూడా టీడీపీకి ప‌ట్టుకొమ్మలు. అలాంటి జిల్లాల్లో టీడీపీ నేత‌ల వ్యూహం ఏంటి ? అస‌లు రాజ‌ధానిపై ఏమంటున్నారు ? అనే ప్రశ్న స‌ర్వత్రా వినిపిస్తోంది. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన టీడీపీ నాయ‌కులు త‌మ‌కు అత్యంత చేరువ‌లో ఉంటుంది క‌నుక విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని ఉండాల‌ని రాజ‌ధానిని మూడు చోట్ల ఏర్పాటు చేసుకుంటే న‌ష్టం ఏమీ లేద‌ని చెబుతున్నారు. పోనీ పార్టీ అధినేత మ‌న‌సులో మాట చెపుదామంటే స్థానికంగా త‌మ‌కు వ్యతిరేక‌త వ‌స్తోంద‌న్న ఆందోళ‌న వారిని వెంటాడుతోంది.

రెండు గంటల ప్రయాణమంటూ…

ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన నాయ‌కులు మాత్రం అన్నీ క‌లిసి అమ‌రావ‌తిలోనే ఉండాల‌ని కోరుకుంటున్నారు. కేవ లం త‌మ‌కు రెండు గంట‌ల్లోనే అమ‌రావ‌తి చేరుకునే సౌల‌భ్యం ఉంటుంద‌ని, కాబ‌ట్టి.. తాము అమ‌రావతి నే శాశ్వత రాజ‌ధానిగా కోరుకుంటున్నామ‌ని చెప్పారు. మొత్తంగా చూస్తే.. ఈ రెండు జిల్లాల‌కు చెందిన టీడీపీ నాయ‌కులు చెరో విధంగా కోరుకుంటుండ‌డంతో పార్టీలో తీవ్రమైన గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News