చేసిదంతా చేశాడు.. ఇప్పుడు చేతులెత్తేశాడు

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంది. నాలుగు రాష్ట్రాలు మినహా అన్ని జిల్లాలు అమెరికాలో కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నాయి. అమెరికా ఇలా [more]

Update: 2020-03-28 16:30 GMT

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంది. నాలుగు రాష్ట్రాలు మినహా అన్ని జిల్లాలు అమెరికాలో కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నాయి. అమెరికా ఇలా కరోనా వైరస్ తో విలవిలలాడటానికి ట్రంప్ వైఖరే కారణమని చెప్పక తప్పుదు. ఫక్తు వ్యాపారి అయిన ట్రంప్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ ను ప్రకటించలేదని, కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఇందులో నిజం లేకపోలేదు.

రోల్ మోడల్ గా ఉండి….

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఒక రోల్ మోడల్. అగ్రరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అటువంటి అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సంక్షోభంలో పడింది. ఎన్నో విపత్తులను ధీటుగా ఎదుర్కొన్న అమెరికా కరోనా వైరస్ విషయంలో మాత్రం అన్ని దేశాల కంటే వెనకబడి పోయింది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ట్రంప్ కరోనాను లైట్ గా తీసుకున్నారు. నిర్లక్ష్యం చేశారు.

మూడు నెలల క్రితం….

అమెరికాలో తొలి కరోనా వైరస్ కేసు జనవరి 21న నమోదయింది. చైనా నుంచి వచ్చిన వ్యక్తికే ఈ వ్యాధి సోకినా ట్రంప్ లైట్ గా తీసుకున్నారు. కరోనా తమను ఏం చేయలేదని పిచ్చి ప్రకటనలు చేశారు. చైనా నుంచి వచ్చిన అమెరికన్లకు కూడా డోర్లు తెరిచారు. వారికి ఎటువంటి పరీక్షలు చేయలేదు. చైనాను నిందించడమే పనిగా పెట్టుకున్నారు. వూహాన్ వైరస్ అంటూ చైనాను ఎగతాళి చేశాడే తప్ప తమకు ప్రమాదం ఉందని ట్రంప్ గుర్తించలేకపోయారు.

ఫక్తు వ్యాపారి కావడంతో…

ట్రంప్ ఫక్కు వ్యాపారి. త్వరలో అమెరికాలో ఎన్నికలు ఉండటంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకే ఎక్కువ ఆలోచించాడు. అందుకే లాక్ డౌన్ కు వెనకడుగు వేశాడు. హెల్త్ కేర్ ను పక్కన పెట్టారు. మార్కెట్లు కుప్ప కూలిపోకుండా ఒక ఇన్వెస్టర్ లాగానే ట్రంప్ ఆలోచనలు కొనసాగాయి. ఈస్టర్ పండగనాటికి కరోనా ఉండదంటూ పిచ్చి ప్రేలాపలను పేలాడు. అయితే ఇప్పుడు దాదాపు లక్ష మందికి కరోనా వైరస్ సోకింది. పదిరోజుల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్, వాషింగ్టన్ లలో ఎక్కువ ప్రభావం చూపింది. ఇప్పుడు ట్రంప్ దగ్గర టెస్టింగ్ కిట్లు లేవు. వెంటిలేటర్లు లేవు. దాదాపు 1700 మంది మరణించడంతో ఇప్పుడు ట్రంప్ కు అసలు పరిస్థితి అర్థమయింది. కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం, ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం వల్లనే అమెరికా కరోనా కాటుకు బలయిందని, ఇందుకు ట్రంప్ వైఖరే కారణమన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News