దేవుడా ..!! ఫుట్ బాల్ ఆడుతున్నారే …?
రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించే ఎన్నికల సంఘానికి ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికే చుక్కలు చుపిస్తున్నాయిట. ఈ మాట ఎవరో [more]
రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించే ఎన్నికల సంఘానికి ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికే చుక్కలు చుపిస్తున్నాయిట. ఈ మాట ఎవరో [more]
రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించే ఎన్నికల సంఘానికి ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికే చుక్కలు చుపిస్తున్నాయిట. ఈ మాట ఎవరో అన్నది కాదు సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘమే నెత్తి నోరు కొట్టుకుని మరీ చెబుతుంది. ఈసీ తలపోటుకు ఇంతకీ కారణం ఏమిటి అంటే ఈవీఎం లు. వీటిపై దేశంలో ఒక్కో పార్టీ ఒక్కో రకంగా వ్యక్తం చేస్తున్న సందేహాలు నివృత్తి చేయలేక ఎన్నికల సంఘం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈవీఎం లు రద్దు చేసి వాటి స్థానంలో బ్యాలెట్ విధానం తిరిగి ప్రవేశపెట్టాలని కాంగ్రెస్, టిడిపి మొదలు పలు పార్టీలు పోరాటం మొదలు పెట్టిన నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ గా నడుస్తుంది.
నమ్మండి రా బాబు …
ఎన్నికల్లో వినియోగిస్తున్న ఈవీఎం లు ఎలాంటి ట్యాపరింగ్ కి గురికావడం లేదని ఈసీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాజకీయ పార్టీలతో భేటీ అయి వారి సందేహాలు నివృత్తి చేశారు. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఈవీఎం లపై తమ స్టాండ్ మార్చేస్తుందని అదే ఇప్పుడు సమస్యగా మారిందని అధికారులు వాపోయారు. ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగిస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎం లను కూడా తమ రాజకీయాలకు కొందరు వదిలి పెట్టడం లేదని అధికారులు అనడం చర్చకు దారి తీసింది. ఓటరు వేసిన ఓటు ను ఈవీఎం ప్యాడ్ ల ద్వారా 50 శాతం లెక్కించాలన్న డిమాండ్ సాధ్యం కాదని తేల్చేసారు అధికారులు.