ఓన్లీ హండ్రెడ్ డేస్…?

తమిళనాడు ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమవుతోంది. ఈ మేరకు అధికారులు సమావేశమై ఎన్నికలపై చర్చించినట్లు తెలిసింది. తమిళనాడు శాసనసభకు రానున్న మే 24వ తేదీతో గడువు [more]

Update: 2021-01-11 17:30 GMT

తమిళనాడు ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్దమవుతోంది. ఈ మేరకు అధికారులు సమావేశమై ఎన్నికలపై చర్చించినట్లు తెలిసింది. తమిళనాడు శాసనసభకు రానున్న మే 24వ తేదీతో గడువు ముగియనుంది. ఈలోపే ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నెల ఆరంభంలోనే తమిళనాడు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది.

ఐదు రాష్ట్రాలకు….

వచ్చే ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే తొలి దశ పోలింగ్ ను ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే రోజు పుదుచ్చేరి ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. దీంతో ఒక తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలకు కేవలం వంద రోజుల సమయం మాత్రమే ఉంది.

వచ్చే నెలలోనే…..

వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే తమిళనాడులో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. కూటములను కూడా ఏర్పరచుకున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ఇప్పటకే ప్రచారాన్ని ప్రారంభించాయి. డీఎంకే అయితే అనధికారికంగా అభ్యర్థులను కూడా కొన్ని చోట్ల నిర్ణయించింది. వారిని ప్రచారం చేసుకోవాల్సిందిగా స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

సమాయత్తమవుతున్న పార్టీలు…..

మరోవైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటమి కూడా ఎన్నికలకు సమాయత్తమయింది. పళనిస్వామి ప్రచారాన్ని ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉండటంతో ఈసారి గెలుపుపై అనుమానాలుండటంతో కొంత ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని అన్నాడీఎంకే భావిస్తుంది. మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ సయితం ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పొత్తులు, ఎత్తులు, సీట్ల పంపకాలపై అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి.

Tags:    

Similar News