బ్రేకింగ్ : ఏపీ ఎన్నికలు ఏప్రిల్ 11
దేశంలో ఎన్నికల నగారా మోగింది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. తొలిసారిగా ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు [more]
దేశంలో ఎన్నికల నగారా మోగింది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. తొలిసారిగా ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు [more]
దేశంలో ఎన్నికల నగారా మోగింది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. తొలిసారిగా ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ఉంచనున్నారు. తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 18వ తేదీన రెండో విడత , మూడో విడత 23 ఏప్రిల్, నాల్గో విడత 29 ఏప్రిల్, ఐదో విడత 6 మే, ఆరో విడత12 మే, ఏడో విడత19మే పోలింగ్ జరుగుతుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. మే 23వ తేదీ కౌంటింగ్ దేశ వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. మే 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. తెలంగాణలోనూ ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఆరోజు ఎన్నికలు జరగనుంది.
ఎన్నికల నిబందన నేటి నుంచే…..
జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ముందస్తు సమాచారాన్ని సేకరించామని కేంద్ర ఎన్నికల కమిషన్ సునీల్ అరోరా తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల సన్నద్ధత గురించి రాష్ట్ర అధికారులతో చర్చించామన్నారు. పరీక్షలు, పండగలు వంటివి అన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే పోలింగ్ తేదీని ఖరారు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పరిస్థితిపై అవగాహనకు వచ్చారన్నారు. దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లున్నారని సునీల్ అరోరా తెలిపారు. కొత్తగా కోటిన్నర మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. వీవీ ప్యాట్ లను ప్రతి ఈవీఎంకు ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా పది లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 3వ తేదీతో ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి ముగియనుంది. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల నిబంధన అమల్లోకి వచ్చిందన్నారు. నేరచరిత్ర ఉన్న అభ్యర్థుల వివరాలను, ఫొటోలను పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. సోషల్ మీడియాకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందన్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు కూడా అభ్యర్థి ఖాతాలోకే వస్తాయన్నారు.మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీ సీట్లు
175 శాసనసభ నియోజకవర్గాలు
ఒడిశా 21 ఎంపీ సీట్లు
147 అసెంబ్లీ సీట్లు
అరుణాచల్ ప్రదేశ్
2 ఎంపీ సీటు
60 శానసనసభ నియోకవర్గాలు
సిక్కిం
1 ఎంపీ సీటు
32 శాసనసభ నియోజకవర్గాలు