ఆయన అవసరమా? ఆయన సేవలు లేకుంటే?

రాజకీయ పార్టీల మనుగడ, నిర్వాహణ ఆషామాషీ కాదు. అనుకున్నంత తేలిక కాదు. ముఖ్యంగా పార్టీని అధికారికంగా నడిపించడం, దానిని కాపాడుకోవడం అత్యంత సంక్లిష్టమైన విషయం.కేవలం పార్టీ అధినేతకు [more]

Update: 2020-03-07 16:30 GMT

రాజకీయ పార్టీల మనుగడ, నిర్వాహణ ఆషామాషీ కాదు. అనుకున్నంత తేలిక కాదు. ముఖ్యంగా పార్టీని అధికారికంగా నడిపించడం, దానిని కాపాడుకోవడం అత్యంత సంక్లిష్టమైన విషయం.కేవలం పార్టీ అధినేతకు ఇతర నాయకులకు గల ప్రజాదరణ ఒక్కటే ఇందుకు సరిపోదు. వ్యుాహ నిపుణులు అవసరం. సందర్బానికి అనుగుణంగా ఎత్తులు పై ఎత్తులు వేయగల దిట్టలు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు కొంత మేధావితనం కుాడా అవసరం. అధినేత ప్రజాదరణకు ఇవి తోడైనప్పుడు ఇక ఆ పార్టీకి ఎదురు ఉండదు. తిరుగుండదు. ఈ వాస్తవాన్ని గుర్తించ లేక పార్టీలు అధినేతలు కిందమీద పడుతుంటారు. కాంగ్రెస్ కు సుదీర్ఘకాలం దిశానిర్దేశం చేసిన ఇందిరాగాంధీకి పీవీ.నరసింహరావు, ప్రణబ్ ముఖర్జీ వంటి మేధావుల సందర్బానికి అనుగుణంగా సలహాలు, సుాచనలు అందించేవారిని చెబుతుంటారు. జనతా పార్టీకి జయప్రకాష్ నారాయణ, నానాజీ దేశ్‍ ముఖ‌‌్, వంటివారు మార్గదర్శనం చేసేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలుాగించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అప్పట్లో పర్వతనేని ఉపేంద్ర, పుట్టపాగ రాధాకృష్ణ వంటివారు దిశా నిర్దేశం చేసేవారని చెబుతుంటారు. రైల్వేలో పనిచేసిన ఉపేంద్ర కొంతకాలం అప్పటి రైల్వేమంత్రి, జనతా నాయకుడు మధుదండావతేకి కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పటికీ పలుపార్టీల అధినేతలకు రాజకీయ కార్యదర్శులు ఉన్నవిషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైస్.జగన్ కు సజ్జల రామకృష్ణారెడ్డి, తెలరగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు శౌరి సుభాష్ రెడ్డి రాజకీయ కార్యదర్శి లేదా సలహాదారులుగా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిన విషయమే.

కొత్త ట్రెండ్ తో….

గత దశాబ్దాల కాలంగా కొత్త ట్రెండ్ నడుస్తుంది. పార్టీలో వ్యూహ కర్తలు, నిపుణులు, మేధావులు ఉన్నప్పటికీ సలహాదారుల నియామకం ప్రారంభమైంది. ప్రధాని మోదీ దీనికి ఆద్యుడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ముాడోసారి ఎన్నికయ్యేందుకు అప్పట్లో ప్రశాంత్ కి‌శోర్ ను తన వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఈ ప్రయత్నంలో విజయవంతమయ్యారు. 2014 లోక్ సభఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకునే సమంయంలోనుా ప్రశాంత్ కిశోర్ సేవలపై ఆయన ఆధారపడ్డారు. అప్పటినుండి ఈ ప్రక్రియ వేగంగా విస్తరించింది. అన్ని పార్టీలు అదేబాట పట్టాయి. 2019 ఎన్నికలకు ముుందు వైసీపీ అధినేత వైస్.జగన్ సైతం ప్రశాంత్ కిషోర్ పైన ఆధారపడ్డారు. తద్వారా తన చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. జగన్ విషయంలో అప్పటిలాగానే వ్యూహకర్త నియామక ప్రక్రియపై తొలుత వ్యతిరేకత వ్యక్తంచేసిన పార్టీలు కుాడా సానుకుాలంగా స్పందించడం ప్రారంభమైంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలు పొంది అధికారాన్ని అందుకుంది. ఒక్క యూపీ ఎన్నికల్లో ఆయన వ్యుాహం పనిచేయలేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గట్టిక్కించే బాధ్యతను తలెకెత్తుకున్న ప్పటికి విజయవంతం కాలేకపోయారు.

ఢిల్లీ ఎన్నికల్లోనూ….

తాజాగా డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సేవలు పొందిన ఆప్ ఘనవిజాయాన్ని సాదించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోనున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబనర్జీ, తమిళనాడులోని డీఎంకే అధినేత స్టాలిన్ కుడా ప్రశాంత్ కిశోర్ మార్గదర్శనం కోసం ఎదురుచుాస్తున్నారు. మమతా బెనర్జీ అయితే ఏకంగా ఆయనకు జడ్ ప్లస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు సైతం ఆయన శిష్యుడి సేవలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

నాడి వారికే తెలుస్తుందా?

ఇక్కడ ఒక వాదన కొత్తగా తెరపైకి వస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు తెలియని ప్రజానాడి బయటి వ్యక్తికి ఎలా అర్దమవుతుందన్నది ప్రదాన ప్రశ్న. అదేవిధంగా రాష్ట్రం ముఖచిత్రం కానీ, రాజకీయ, ఆర్ధిక, సామాజిక, బౌగోళిక పరిస్తితులు తెలియని వడ ఆధారపడటం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు తిన్న పార్టీ అధినేతలకు ఈ వృత్తి నిపుణుడు ఎంతవరకు అవసరం అన్న ప్రశ్న కుాడా ఎదురవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అధినేతల అనుచరులు, సహచరులు ఆయనకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అసలు విషయాన్ని పుార్తిగా చెప్పరు. రుచించని విషయాన్ని చెబితే ఎక్కడ అధినేతకు దుారమవుతామోనన్న భయంతో వారు ఒకింత వెనుకడుగు వేసే మాట వాస్తవం. అదే సలహాదారుడు అయితే ప్రతిఫలం తీసుకుని పనిచేసే వ్యక్తి. క్షేత్రస్థాయి పరిస్తితులను, పార్టీ లోపాలు, బలహీనతలు, చక్కదిద్దుకోవలసిన విషయాలను నిర్మొహమాటంగా చెబుతారు. వీటిని ఎలా అధిగమించాలో కుాడా సుాచనలిస్తారు. అందువల్ల ప్రజా జీవితంలో తలపండిపోయిన వివిధ పార్టీల అధినేతలు కుాడా ప్రశాంత్ కిషోర్ సేవలు పొందేందుకు ఆసక్తి చుాపుతున్నారు. ఇందులో హేతుబధ్దత లేకపోలేదు కుాడా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News