అదే కీలకం…ఇక్కడ గెలిస్తే?
బీహార్ రెండో దశలో జరిగిన ఎన్నికలే కీలకం కానున్నాయి. గెలుపోటములు నిర్ణయించనున్నాయి. ప్రధానంగా రెండోదశలో 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో కీలకమైన ప్రాంతాలు ఉండటంతో [more]
బీహార్ రెండో దశలో జరిగిన ఎన్నికలే కీలకం కానున్నాయి. గెలుపోటములు నిర్ణయించనున్నాయి. ప్రధానంగా రెండోదశలో 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో కీలకమైన ప్రాంతాలు ఉండటంతో [more]
బీహార్ రెండో దశలో జరిగిన ఎన్నికలే కీలకం కానున్నాయి. గెలుపోటములు నిర్ణయించనున్నాయి. ప్రధానంగా రెండోదశలో 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో కీలకమైన ప్రాంతాలు ఉండటంతో రెండో దశ ఎన్నికలే గెలుపోటములను నిర్ణయించనున్నాయన్నది విశ్లేషకుల అంచనా. ప్రధానంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, షియోపహర్, మధుబావి, దర్బంగా, షియోపూర్త, గోపాల్ గంజ్, ముజఫర్ పూర్, సివాన్, సమస్థిపూర్, బెగుసరై, బాగల్పూరు, నలంద, పాట్లా, వైశాలి, సరన్ ప్రాంతాలు ఉన్నాయి.
ఎక్కువ స్థానాల్లో……
ఇక్కడ లోక్ జనశక్తి పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. దాని ఆశలన్నీ ఈ ప్రాంతంపైనే ఉన్నాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేస్తుంది. నితీష్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించి చిరాగ్ పాశ్వాన్ బయటకు వచ్చారు. జేడీయూ పోటీ చేస్తున్న ప్రాంతాల్లోనే ఎల్జేపీ తన అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ 52 స్థానాల్లో గెలుపోటములు అధికార పీఠం ఎవరదనేది నిర్ణయించనున్నాయి.
పట్టు ఉండటంతో…..
ఈ ప్రాంతంలో చిరాగ్ పాశ్వాన్ పార్టీకి పట్టుంది. అందుకే ఆయన తన ప్రచారం మొత్తాన్ని ఇక్కడే నిర్వహించారు. తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి ఓట్లు వస్తాయని చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఇటీవల తలెత్తిన వరదలతో కూడా ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలి తన పార్టీ ఖాతాలో పడతాయని చిరాగ్ పాశ్వాన్ భావిస్తున్నారు.
అందుకే కీలకం…
బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ చెరిసగం సీట్లను పంచుకున్నాయి. తమ మిత్రపక్షాలకు కొన్ని సీట్లను పంచాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో జరిగిన ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. లోక్ జనశక్తి పార్టీ ఎక్కువ స్థానాలను ఇక్కడ కైవసం చేసుకుంటే ఆయన నిర్ణయాత్మక శక్తిగా మారతారన్నది వాస్తవం. నితీష్ కుమార్ కు కూడా రెండోదశ పోలింగ్ కు కఠినంగా మారనుంది. మొత్తం మీద నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ భవితవ్యాలను రెండో దశ పోలింగ్ నిర్ణయించనుంది.