ఈసారి గెలిపించేది వాళ్లేనట

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు పూర్తి కావచ్చాయి. మరో దశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో [more]

Update: 2021-04-27 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు పూర్తి కావచ్చాయి. మరో దశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. అయితే సామాజికవర్గాల పరంగా రెండు పార్టీలు దృష్టి పెట్టి ఓట్ల వేటలో పడ్డాయి. ఆ సామాజికవర్గాలపై వరాల జల్లు కురిపించడమే కాకుండా వారికే సీట్లు కేటాయించడంతో గెలుపోటములపై సందిగ్దత నెెలకొంది.

సామాజికవర్గాల పరంగానే….?

మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్ లో సామాజికవర్గాల పరంగానే ఈసారి గెలుపోటములుంటాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం బలంగా ఉంది. దాదాపు 28 శాతం ముస్లిం ఓటర్లున్నారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలూ కసరత్తు చేశాయి. మొన్నటి వరకూ ముస్లిం సామాజికవర్గం మమత బెనర్జీకి అండగా ఉండేది. అయితే ఈసారి ఆ ఓట్లలో చీలిక వచ్చే అవకాశముందమని మమతబెనర్జీ గుర్తించారు.

దళిత ఓటు బ్యాంకు…..

దీనికి కారణం పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎన్ఎఫ్ కూటమి పోటీ చేయడమే. ముస్లిం ఓటర్లు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు దీంతో మమత బెనర్జీ దళిత ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టారు. దాదాపు 24 శాతం ఉన్న ఈ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మమత బెనర్జీ సర్వశక్తులూ ఒడ్డారు. వీరి ప్రభావం దాదాపు 110 సీట్లలో ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు.

మమత ఆశలన్నీ…..

అందుకే పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ 79 నియోజకవర్గాల్లో ఎస్సీలను బరిలోకి దింపింది. ఆరు నియోజకవర్గాలను ఎస్టీలకు కేటాయించింది. 2019 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో 18 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు మమత బెనర్జీ ప్రయత్నం చేశారు. బీజేపీ కూడా ఆ ఓటు బ్యాంకుపైనే కన్నేయడంతో వీరు ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు.

Tags:    

Similar News