మే నెల మార్చేస్తుందా ?
మే నెల అంటే మండే ఎండలు గుర్తుకువస్తాయి. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఎపుడూ అదే నెలలో జరిగి ఫలితాలు వస్తూంటాయి. ఈసారి కూడా మినీ పార్లమెంట్ [more]
మే నెల అంటే మండే ఎండలు గుర్తుకువస్తాయి. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఎపుడూ అదే నెలలో జరిగి ఫలితాలు వస్తూంటాయి. ఈసారి కూడా మినీ పార్లమెంట్ [more]
మే నెల అంటే మండే ఎండలు గుర్తుకువస్తాయి. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఎపుడూ అదే నెలలో జరిగి ఫలితాలు వస్తూంటాయి. ఈసారి కూడా మినీ పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కూడా మే నెలలో రానుంది. ఈ ఫలితాలు రెండు తెలుగు రాష్టాలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు మోడీ హవా బాగా ఉందని భావిస్తూ భ్రమిస్తూ సౌండ్ చేయకుండా ఉంటున్న తెలుగు రాష్ట్రాల అధికార రాజకీయాలు ఫలితాల తరువాత గొంతు విప్పే చాన్స్ ఉందని అంటున్నారు.
పిల్లి మెడలో గంట..?
మమత బెనర్జీ, బెంగాలీ కాళీమాతగా చెబుతారు. ఆమె మోడీకి ఏ రోజూ భయపడలేదు. ప్రధానితో ప్రోటోకాల్స్ విషయంలో కూడా మొక్కుబడిగానే వ్యవహరిస్తారు అని పేరు. అంటువంటి మమత కనుక హ్యాట్రిక్ విజయం సాధిస్తే మాత్రం తెలుగు రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయని అంటున్నారు. అంతే కాదు తమిళనాడులో స్టాలిన్ గెలిచినా కూడా పెద్ద ఊపే వస్తుంది అని చెబుతున్నారు. మోడీ తో ఢీ కొట్టే నేతలు దొరికారని తెలుగు రాష్త్రాల పెద్దలు సంబరాలు చేసుకుంటారని కూడా చెబుతున్నారు.
తిరుపతితో అలా ..?
ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చూసుకుంటే ఫలితం వైసీపీకి అనుకూలంగా ఎటూ వస్తుంది. అది ఎంత అనుకూలం అన్నదే మే నెలలో తేలుతుంది. అంటే గత ఎన్నికల్లో వచ్చిన ఏడున్నర లక్షల మెజారిటీ ఇపుడు రావాలి. అదే సమయంలో మెజారిటీ కూడా గత సారి కంటే ఎక్కువగా రావాలి. అపుడే వైసీపీ తలెత్తుకుని తిరగగలదు. లేకపోతే ఆ పార్టీకి రాజకీయ చిక్కులు తప్పవని లెక్కలు వేస్తున్నారు. ఇక టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన అయిదు లక్షల ఓట్లూ మళ్ళీ దక్కాలి. ఏ మాత్రం తగ్గినా కూడా ఆ పార్టీలో భూ కంపాలు పుడతాయని గట్టిగా చెప్పాల్సిందే.
ఇలా జరిగేనా ..?
తిరుపతిలో నైతిక విజయాలు అంటూ ఉండవనే అంతా అంటున్నారు. కానీ తక్కువ ఓట్లు టీడీపీ తెచ్చుకున్నా బీజేపీ తాను అనుకున్నట్లుగా లక్ష ఓట్ల టార్గెట్ కి రీచ్ అయినా ఏపీలో సమీకరణలు వేగంగా మారుతాయి. అపుడు జనసేన బీజేపీ కూటమి జోరు చేస్తుంది. టీడీపీ దాని వెంట పడాల్సి ఉంటుంది. అలా కాకుండా బీజేపీకి అతి తక్కువ ఓట్లు వచ్చి టీడీపీ తన ప్లేస్ ని కాపాడుకుంటే అపుడు 2014 నాటి పొత్తులకు ఆస్కారం ఉంటుంది. మరో వైపు టీడీపీ ఓట్లు దారుణంగా తగ్గితే ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కూడా అంటున్నారు. వాటిని అట్రాక్ట్ చేయడానికి వైసీపీ బీజేపీ కూడా కాచుకుని ఉన్నాయి. మొత్తానికి అయిదు రాష్ట్రాలు, తిరుపతి ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలనే కాదు తెలుగు రాజకీయాలను కూడా మార్చే సీన్ ఉంది అంటున్నారు.