వాళ్లొస్తే తన పని ఖతమేనట

హుజూరాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం చేస్తుండగా, అధికార పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. [more]

Update: 2021-08-17 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం చేస్తుండగా, అధికార పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ వరస గెలుపులకు అడ్డుకట్ట వేయాలన్నది అధికార పార్టీ ఆలోచన. అయితే ఈసారి ఎలాగైనా గెలిచి తన సత్తా చాటాలని ఈటల రాజేందర్ కోరుకుంటున్నారు. అందుకే పాదయాత్ర కూడా ప్రారంభించారు. పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది.

బీజేపీ వల్ల….

అయితే హుజూరాబాద్ లో బీజేపీకి ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదు. కేవలం ఈటల రాజేందర్ పేరు మీదనే గెలవాల్సి ఉంటుంది. దుబ్బాక తరహాలో అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే హుజూరాబాద్ లోనూ పనిచేస్తుంది. అందుకే ఈటల రాజేందర్ బీజేపీ నేతలను దూరంగా పెట్టినట్లు తెలిసింది. వారు ప్రచారానికి ఎక్కువగా వస్తే తనకు డ్యామేజీ జరుగుతుందని ఈటల రాజేందర్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఒంటరి పోరాటం చేయడానికే నిర్ణయించుకున్నారు.

పర్యవేక్షణ బాధ్యత కూడా….

బీజేపీపై ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత తనపై పడకుండా ఉండేలా ఈటల రాజేందర్ జాగ్రత్త పడుతున్నారు. బీజేపీ నేతల ప్రచారం వల్ల తనకు నష్టమే కాని ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన గ్రహించారు. అందుకే బీజేపీ నేతలను ప్రచారానికి రావద్దని కోరుకుంటుున్నారు. ఒంటరిగా తాను ఈ ఎన్నికల్లో తేల్చుకుని వస్తానని ఆయన పార్టీ పెద్దలతో చెప్పినట్లు తెలిసింది. మండలాల వారీగా తన అనుచరులే ఎన్నికల పర్యవేక్షణ భాధ్యతను చూసుకుంటారని కూడా ఈటల రాజేందర్ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం.

కొద్దిమంది మాత్రమే….

దీంతో బీజేపీ అగ్రనేతలు ఎవరూ ఇంతవరకూ హుజూరాబాద్ లో పర్యటించలేదు. కేవలం మాజీ ఎంపీ వివేక్ తో పాటు మరికొందరు నేతలు మాత్రమే ఈటల రాజేందర్ కు అండగా ఉంటున్నారు. సామాజికవర్గాల పరంగా బలంగా ఉన్న నేతలను మాత్రమే ఈటల రాజేందర్ హుజూరాబాద్ కు రావాలని కోరినట్లు చెబుతున్నారు. పోటీ తనకు, టీఆర్ఎస్ కు మాత్రమేనని, బీజేపీకి కాదని కూడా ఆయన చెబుతున్నారు.

Tags:    

Similar News