Etala rajender : తేడా కొడితే ఇక అంతేనట
హుజూరాబాద్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. సమయం దగ్గరపడింది. ఈ ఎన్నిక ఈటల రాజేందర్ రాజకీయ భవిష‌్యత్ ను నిర్దేశించబోతుంది. ఈటల రాజేందర్ ఉద్యమ కాలం నుంచి [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. సమయం దగ్గరపడింది. ఈ ఎన్నిక ఈటల రాజేందర్ రాజకీయ భవిష‌్యత్ ను నిర్దేశించబోతుంది. ఈటల రాజేందర్ ఉద్యమ కాలం నుంచి [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. సమయం దగ్గరపడింది. ఈ ఎన్నిక ఈటల రాజేందర్ రాజకీయ భవిష‌్యత్ ను నిర్దేశించబోతుంది. ఈటల రాజేందర్ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు. టీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు. విపక్షంలో ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆఫర్లను కూడా ఆయన వదులుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు టీఆర్ఎస్ కు నమ్మకమైన నేతగానే ఈటల రాజేందర్ కొనసాగారు.
రెండోసారి వచ్చిన తర్వాత….
కానీ రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ లో అసంతృప్తి మొదలయింది. వైద్య శాఖ మంత్రిగా కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల మంత్రులకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. ఏకపక్ష పాలన జరుగుతోందని, ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అంతర్మధనం ప్రారంభమయింది. అందువల్లనే ఆయన ప్రభుత్వం, పథకాలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫలితం ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు, మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయడం శరవేగంగా జరిగిపోయాయి.
ఆత్మగౌరవం నినాదంతో….
అయితే తాను ఆత్మగౌరవం కలవాడినని చెప్పి ఈటల రాజేందర్ వెంటనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఫలితంగానే ఎన్నికలు వచ్చాయి. అయితే ఈటల రాజేందర్ ను ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఈసారి ఈటల రాజేందర్ కు గెలుపు అంత సులువు కాదు. సర్వశక్తులనూ అధికార పార్టీ మొహరించింది.
వ్యక్తిగత ఓట్లతోనే….
డబ్బులకు, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఈటల రాజేందర్ చెబుతున్నప్పటికీ ఎన్నికలలో చివరికి దేనిని విజయం సాధిస్తుందో అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ అన్ని సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది. బీజేపీ కి పెద్దగా ఓటు బ్యాంకు లేకపోవడంతో ఈటల రాజేందర్ వ్యక్తిగతంగానే ఈ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈటల రాజేందర్ కు ఈ ఎన్నికలు చావోరేవో అని చెప్పక తప్పదు.