Etala rajender : ఈటలకు మిగిలింది ఆ ఒక్క ఛాన్సేనట
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడింది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఒకరకంగా ఇది పైకి [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడింది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఒకరకంగా ఇది పైకి [more]
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడింది. ఇప్పటికే ఈ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ ఎత్తున బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఒకరకంగా ఇది పైకి పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికే అయినా, వ్యక్తిగతంగా కేసీఆర్, ఈటల రాజేందర్ కు మధ్య జరుగుతున్న వార్ గా చూడాలి. పార్టీ నుంచి బయటకు పంపిన విధానం నచ్చని ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది.
ప్రభుత్వంపై కామెంట్స్….
ఈటల రాజేందర్ మంత్రిగా ఉండి పార్టీపై కొన్ని కామెంట్స్ చేశారు. అది ఆయన పార్టీ అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలను బయటే చెప్పేశారు. కేసీఆర్ స్కీమ్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలు అధినేతకు ఆగ్రహం తెప్పించాయి. చివరకు పొగపెట్టేందుకు సిద్దమయ్యారు. కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి తప్పించారు. దానికి కారణం భూ ఆక్రమణలకు పాల్పడ్డరాని ఆయనపై ఆరోపణలు చేయడమే.
భూ ఆక్రమణలంటూ….
ఈటల రాజేందర్ పై భూ ఆక్రమణల ఆరోపణలతో కేసీఆర్ సరిపెట్టలేదు. ఆయన భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు. వెంటనే అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. నిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు తాను ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని ఈటల రాజేందర్ వివరణ ఇచ్చుకున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, అధికారులతో తనను, తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని ఈటల రాజేందర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
విచారణ ఏమయింది?
ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తనను కావాలనే బయటకు పంపారని చెబుతున్నారు. తాను కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అడ్డుపడతానన్న ఏకైక కారణంగానే తనపై కావాలని భూ ఆక్రమణలు చేశారని జనానికి చెబుతున్నారు. మొత్తం మీద ఈటల రాజేందర్ చెప్పేదానిలో వాస్తవం ఉందని జనం నమ్మితే ఆయన స్వల్ప ఆధిక్యతతోనైనా బయటపడే అవకాశాలున్నాయంటున్నారు.