ఇక రచ్చ రంబోలానేనా…?
గులాబీ గూటిలో రచ్చ మొదలైనట్టేనా..? ఇక ముందుముందు రచ్చరచ్చేనా..? తన మంత్రి పదవి ఎవరి భిక్ష కాదంటూ మంత్రి ఈటల రాజేందర్ ఉద్వేగపూరితంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు [more]
గులాబీ గూటిలో రచ్చ మొదలైనట్టేనా..? ఇక ముందుముందు రచ్చరచ్చేనా..? తన మంత్రి పదవి ఎవరి భిక్ష కాదంటూ మంత్రి ఈటల రాజేందర్ ఉద్వేగపూరితంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు [more]
గులాబీ గూటిలో రచ్చ మొదలైనట్టేనా..? ఇక ముందుముందు రచ్చరచ్చేనా..? తన మంత్రి పదవి ఎవరి భిక్ష కాదంటూ మంత్రి ఈటల రాజేందర్ ఉద్వేగపూరితంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమా..? ఆయన సూటిగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ధిక్కార స్వరం వినిపించారా..? అంటే రాజకీయవర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనే ఔననే సమాధానమే వస్తోంది. అధికార టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందని, అంతర్గతంగా మరేదో రచ్చ మొదలైందని.. అది ఈరోజు ఈటల రాజేందర్ మాటల రూపంలో బయటపడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరగుతోంది.
కీలక సమయంలో……
నిజానికి.. మంత్రి ఈటల రాజేందర్ అంత్యంత కీలక సమయంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. ఒకవైపు బీజేపీ దూసుకొస్తోంది.. మరోవైపు కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మంత్రివర్గం నుంచి తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలను మంత్రి ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. అనామకుడిగా వచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నా మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు.
త్వరలోనే తెలుస్తుందంటూ….
అధికారం శాశ్వతం కాదు ధర్మం, న్యాయం శాశ్వతం. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుహానావాదులు, సంకుచిత బుద్ధితో వ్యవహరించేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా ఎదగలేని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు హీరోనో ఎవరు జీరోనో త్వరలో తెలుస్తుంది అంటూ హుజురాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈటల రాజేందర్ బాంబు పేల్చారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ.. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పరోక్షంగా కేసీఆర్ ను…..
ఇక్కడ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఈటల రాజేందర్. తాను పార్టీలోకి మధ్యలో వచ్చిన వాడిని కాదని, గులాబీ జెండా ఓనర్లలో ఒకడిననని మంత్రి ఈటల రాజేందర్ సూటిగా చెప్పేశారు. దీంతో తనను ఎవరూ తప్పించలేరని, పార్టీపై సీఎం కేసీఆర్‌కు ఎంత అధికారం ఉందో.. తనకూ అంతే అధికారం ఉందని ఆయన పరోక్షంగా చెప్పినట్టేనని పలువురు నాయకులు అంటున్నారు. నిజానికి.. ఇటీవలే.. పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలోనే అంతర్గత కలహాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని చెప్పిన రెండు రోజుల్లోనే మంత్రి ఈటల రాజేందర్ గులాబీ జెండా ఓనర్లలో ఒకడినంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఉమ్మడికరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడుతోంది. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ముందుముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి.