కమ్మ వర్సెస్ రెడ్లు.. ఎవరి హయాంలో ఎలా..?
ఉమ్మడి రాష్ట్రం సహా, విభజిత రాష్ట్రం ఏపీలోనూ అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షంలో కూర్చున్నా.. రెండే రెండు కులాలు కనిపిస్తున్నాయి. అవే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు. 1983కు [more]
ఉమ్మడి రాష్ట్రం సహా, విభజిత రాష్ట్రం ఏపీలోనూ అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షంలో కూర్చున్నా.. రెండే రెండు కులాలు కనిపిస్తున్నాయి. అవే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు. 1983కు [more]
ఉమ్మడి రాష్ట్రం సహా, విభజిత రాష్ట్రం ఏపీలోనూ అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షంలో కూర్చున్నా.. రెండే రెండు కులాలు కనిపిస్తున్నాయి. అవే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు. 1983కు ముందు నాటి సమైక్య రాష్ట్రంలో రెడ్డి ముఖ్యమంత్రులే ఎక్కువుగా పాలన చేశారు. అయితే తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు కోస్తాలో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో కూడా కమ్మల హవా ఉండేది. విభజిత ఏపీని తీసుకుంటే.. 2014లో కమ్మ వర్గానికి చెందిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఇక, గత ఏడాది ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్ ప్రభుత్వ ఏర్పాటు చేశారు. ఇక, గతంలోనూ దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, తర్వాత కాంగ్రెస్ నుంచి రెడ్డి నేతలు రాష్ట్రాన్ని పాలించారు. అయితే, ఎవరు అధికారంలోకి వచ్చినా.. మరో సామాజిక వర్గాన్ని తొక్కేయడం, అణిచేయడం, చులకన చేయడం వంటి పరిస్థితి లేదు.
ఎన్టీఆర్ హయాంలో…….
కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మోహన్‌రెడ్డి.. తమను అణిచి వేస్తున్నారంటూ.. కమ్మ సామాజిక వర్గం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన విమర్శల నేపథ్యంలో అసలు ఉమ్మడి రాష్ట్రంలోను, తర్వాత.. ఈ రెండు సామాజిక వర్గాలకు దక్కిన ప్రాధాన్యం ఏంటో చర్చకు వస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కమ్మ అయినా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. నల్లపరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బెజవాడ పాపిరెడ్డి, జానారెడ్డి, జీవన్‌రెడ్డి సహా చాలా మంది రెడ్డి నాయకులు ఎదిగారు. మంత్రులుగా కూడా పనిచేశారు.
కాంగ్రెస్ పాలనలోనూ….
తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రిచెన్నారెడ్డి హయాంలోనూ.. కమ్మల హవా బాగానే సాగింది. చిత్తూరు జిల్లాలో గల్లా అరుణ కుటుంబం, పశ్చిమలో మాగంటి బాబు కుటుంబం, గుంటూరులో రాయపాటి సాంబశివరావు, కృష్ణాలో పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబాలు బాగానే చక్రం తిప్పారు. ఇక, 1994లో సీఎం అయిన ఎన్టీఆర్ కూడా మళ్లీ గతంలో మాదిరిగానే రెడ్డి వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, తర్వాత చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చాక కూడా ఆయన కూడా రెడ్డి వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. కడపలో శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డి, సోమిరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడపలో రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు.
బలం ఉన్న నేతలను వైఎస్…..
2004లో వైఎస్ సీఎం అయినా.. కమ్మ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. చిత్తూరులో గల్లా, పశ్చిమలో మాగంటి వర్గాలను ఆయన బాగానే చూసుకున్నారు. నాడు కృష్ణాలో దేవినేని నెహ్రూ హవానే ఉండేది. గుంటూరులో రాయపాటి, బెజవాడలో లగడపాటి, పర్చూరులో దగ్గుబాటి, మార్టూరులో గొట్టిపాటి లాంటి కమ్మనేతల హవా బాగానే నడిచింది. తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యలు సీఎంలు అయినా.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో వారు ఏ వర్గాన్నీ పట్టించుకోలేదు. స్థానికంగా ఎవరికి బలం ఉంటే వారినే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు.
రాష‌్ట్ర విభజన తర్వాత….
ఇక, 2014లో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చాక కూడా కమ్మలకు ప్రాదాన్యం ఇచ్చారు. ప్రతిపాటి పుల్లారావు, పరిటాల సునీత, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్ ఆ తర్వాత తన తనయుడు లోకేష్ వంటి టీడీపీ నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. అప్పుడు అదే టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో రెడ్డి వర్గానికి ప్రాధాన్యం లభించడం లేదన్నారు. ఇక, ఎన్నికలకు ముందు కూడా వైఎస్సార్ సీపీ నాయకులు ఇదే తరహా వాదనను తెరమీదికి తెచ్చారు. జగన్ పార్టీ నాయకులు కూడా తీవ్రస్థాయిలో తమకు బాబు అన్యాయం చేస్తున్నారనే వాదనను వినిపించారు.
ఇప్పుడు జగన్ కూడా….
కమ్మలను మిగిలిన కులాలకు దూరం చేసే స్ట్రాటజీతో జగన్ అండ్ కో వేసిన పాచిక కొంత వరకు పారిందనే చెప్పాలి. ఇది పార్టీకి కలిసి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, ఇప్పుడు.. రాజధాని తరలింపు, గత ప్రభుత్వంలో చేపట్టిన పనులపై నిఘా వంటి కార్యక్రమాల ద్వారా జగన్..కమ్మలకుచెక్ పెడుతున్నారనే వాదన టీడీపీలో వినిపిస్తోంది. లోకేష్‌తో పాటు టీడీపీలో కొందరు జగన్ కమ్మలను టార్గెట్ చేస్తూ రెడ్లకు పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు తరచూ చేస్తున్నారు. స్టేట్ డివైడ్‌కు ముందు అంతా బాగానే ఉన్నా.. తర్వాత మాత్రం ఈ తరహా పరిస్థితి ఏర్పడిందనే వాదన బలంగా ఉంది. మరి మున్ముందు ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.