సీబీఐకి అంత సీన్ లేదా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కేసును సీబీఐకి అప్పగించాలంటున్నారు. చివరకు హైకోర్టు సయితం సీఐడీ కంటే సీబీఐకి అప్పగించడమే బెటరని ఇటీవల వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో [more]

Update: 2020-10-15 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి కేసును సీబీఐకి అప్పగించాలంటున్నారు. చివరకు హైకోర్టు సయితం సీఐడీ కంటే సీబీఐకి అప్పగించడమే బెటరని ఇటీవల వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక ఏపీలో విపక్షాలన్నీ సీబీఐ దర్యాప్తునే కోరుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావడం, దాని విచారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం చూపలేదని నమ్మకం ఉండటమే.

ప్రతి విషయాన్ని…..

అందుకే ఏపీలోని ప్రతి కేసు సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ వినిపించడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. అసలు సీబీఐ నిష్పక్షపాత విచారణ ఎంతవరకూ సాధ్యమన్నది కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏపీలో వివేకా హత్య కేసు, యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసు, డాక్టర్ సుధాకర్ పై పోలీసుల దాడి కేసు వంటివి సీబీఐ విచారణ చేస్తుంది. మొన్న జరిగిన అంతర్వేది నరసింహస్వామి రధం దగ్దం కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

సీబీఐకి అప్పగించాలని…..

ఇక అమరావతి రాజధాని భూముల వ్యవహారం, ఫైబర్ గ్రిడ్ లో అవినీతిపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం పదే పదే కోరుతుంది. ప్రభుత్వంతో పాటు విపక్షాలు సయితం సీబీఐ దర్యాప్తునకు మొగ్గు చూపుతున్నాయి. అయితే తాజాగా సీబీఐ దర్యాప్తు చేసిన కేసులు వీగిపోతుండం కూడా మరోవైపు చర్చనీయాంశంగా మారింది. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శేఖర్ రెడ్డి పై నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయల నగదు కేసు నమోదయింది.

రెండు కేసుల్లో…..

అయితే ఈ కేసులో శేఖర్ రెడ్డిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చింది. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చినా సీబీఐ అధికారులు ఏమాత్రం నిరూపించలేకపోయారు. ఇక బాబ్రీ మసీదు విషయం మనకు తెలిసిందే. కొన్నేళ్ల పాటు విచారించిన సీబీఐ అధికారులు సమర్పించిన ఆధారాలు ఈ కేసులో ఎవరినీ దోషులగా నిరూపించలేకపోయాయి. మరి సీీబీఐ విచారణలో లొసులుగున్నాయా? ఈ రెండు కేసుల్లో మాత్రమే అంతేనా? అన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద సీబీఐ కి అంత సీన్ లేదన్న వ్యాఖ్యలు కూడా మరోవైపు నుంచి విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News