క్రమంగా సడలిస్తున్నారు.. వాటిని కూడా?

మే 17 వ తేదీ వరకూ భారత్ లో లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల మినహాయింపులను ఇచ్చింది. [more]

Update: 2020-05-11 18:29 GMT

మే 17 వ తేదీ వరకూ భారత్ లో లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల మినహాయింపులను ఇచ్చింది. ఇప్పటికే లిక్కర్ షాపులను రెడ్ జోన్ లలో కూడా అనుమతించారు. ఒక్క విద్యాలయాలు, ప్రార్థనాలయాలు, సినిమా హళ్లు, హోటళ్లకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. సినిమా హాళ్లు, హోటళ్లు మాత్రం తెరుచుకునే సరికి మరో నెల రోజులకు పైగానే సమయం పట్టే అవకాశముంది.

హోటళ్లు, సినిమాహాళ్లు మాత్రం….

హోటళ్లు, సినిమాహాళ్లు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ ను పాటించడం సాధ్యం కాదు. దీంతో వీటిని ఇప్పుడప్పుడే తెరిచే అవకాశం లేదన్నది వాస్తవం. ఇక లాక్ డౌన్ మినహాయింపులతో క్రమంగా గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో సాధారణ జీవనం ప్రారంభమయింది. ప్రజలు మాస్క్ లు ధరించి బయటకు రావడం, చేతులు శుభ్రపర్చుకోవడం వంటి వాటికి అలవాటు పడ్డారు.

ప్రజా రవాణాను పునరుద్ధరించేందుకు…

దీంతో ప్రజా రవాణాను కూడా పునరుద్ధరించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటన చేశారు. లాక్ డౌన్ కారణంగా గత నలభై రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు క్యాబ్ లు, ఆటోలు రోడ్డెక్కలేదు. ఆటోలు, క్యాబ్ లకు కూడా పరిమిత సంఖ్యలో గ్రీన్ జోన్ లో మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈరంగంలో కోట్లాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.

నిబంధనల మేరకే….

అందుకే మే 17వ తేదీ తర్వాత వచ్చే మినహాయింపుల్లో ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండే అవకాశముంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఎప్పటికప్పుడు వాహనాలను శుభ్రపర్చడం, బస్సుల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం, నాన్ ఏసీ బస్సులనే వినియోగించడం వంటి అంశాలను ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మరో పది రోజుల్లో ఆర్టీసీ బస్సులు, క్యాబ్ లు రోడ్డుపైకి వచ్చే అవకాశముంది. ఈలోగా ప్రజలు కూడా కరోనా వైరస్ కు అలవాటు పడిపోతారని ప్రభుత్వం భావిస్తుంది.

Tags:    

Similar News