తేజస్వి వైపే మొగ్గు… నితీష్ ఇంటికేనా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితలు వెల్లడయ్యాయి. దాదాపు అన్ని సంస్థలు ఆర్జేడీ కూటమి వైపుకే మొగ్గు చూపాయి. నితీష్ కుమార్ మూడు దఫాలుగా [more]

Update: 2020-11-07 18:29 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితలు వెల్లడయ్యాయి. దాదాపు అన్ని సంస్థలు ఆర్జేడీ కూటమి వైపుకే మొగ్గు చూపాయి. నితీష్ కుమార్ మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఆయనపై ఉన్న వ్యతిరేకత ఈసారి ఆర్జేడీకి లాభించందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్ వైపే ఎక్కువ మంది ఎగ్జిట్ పోల్స్ లో మొగ్గు చూపడం విశేషం.

మ్యాజిక్ ఫిిగర్ దాటేసి…..

బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 122 గా ఉంది. ఈసారి లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ ఈసారి స్వల్ప తేడాతోనైనా అధికారంలోకి రావచ్చని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. పీపుల్స్ పల్స్ సర్వేలో ఆర్జేడీకి 85 నుంచి 95 సీట్లు, కాంగ్రెస్ కు పదిహేను నుంచి ఇరవై స్థానాలు ఎల్పీజీకి మూడు నుంచి ఐదు స్థానాలు, వామపక్సాలు మూడు నుంచి ఐదు స్థానాలు సాధిస్తాయని ఈ సర్వేలో తేలింది. ఎన్డీఏలో బీజేపీకి 65 నుంచి 75 స్థానాలు, జేడీయూకు 25 నుంచి 35 స్థానాలు దక్కే అవకాశాలున్నాయని తేలింది.

ప్రతి సర్వేలో ఎడ్జ్ తో…..

టైమ్స్ నౌ – సీఓటరు సర్వేలో కూడా ఆర్జేడీ వైపే మొగ్గు చూపింది. ఈ సర్వేలో ఎన్డీఏకు 116, మహాగడ్బంధన్ కు 120 స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నాయని తేల్చింది. ఎల్జీపీ ఒక్క స్థానానికే పరిమితమవ్వవచ్చని పేర్కొంది. ఏబీపీ న్యూస్ సర్వేలో ఎన్డీఏకు 104 నుంచి 128, మహాగడ్బంధన్ కు 108 నుంచి 131, రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వేలో ఎన్డీఏకు 91 నుంచి 117, మహాగడ్బంధన్ కు 118 నుంచి 138 స్థానాలు దక్కవచ్చని పేర్కొంది. దీంతో హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు ఆర్జేడీ వైపే ప్రజలు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడయింది.

పాశ్వాన్ పార్టీ తో…..

చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం వహించిన లోక్ జన్ శక్తి పార్టీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని తేలింది. పాశ్వాన్ పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల మహాగడ్బంధన్ కే లాభించిందని అన్ని సర్వేలు దాదాపుగా తేల్చి చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిజమైతే బీహార్ లో లాంతరు వెలిగిపోతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. తండ్రి స్థాపించిన ఆర్జేడీని తేజస్వి యాదవ్ అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. లాలూ యాదవ్ జైలులో ఉంచిన అంశాన్ని ఎక్కువ మంది ప్రజలు కక్ష సాధింపు చర్యగానే భావించి ఆర్జేడీ వైపు మొగ్గు చూపారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News