లాక్ డౌన్ ముగుస్తోంది.. అయినా?
దేశ వ్యాప్తంగా రేపటితో ఐదో విడత లాక్ డౌన్ ముగుస్తుంది. అయితే మరోసారి లాక్ డౌన్ విధించేది లేదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. [more]
దేశ వ్యాప్తంగా రేపటితో ఐదో విడత లాక్ డౌన్ ముగుస్తుంది. అయితే మరోసారి లాక్ డౌన్ విధించేది లేదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. [more]
దేశ వ్యాప్తంగా రేపటితో ఐదో విడత లాక్ డౌన్ ముగుస్తుంది. అయితే మరోసారి లాక్ డౌన్ విధించేది లేదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయాన్ని మోదీ వ్యక్తం చేయడంతో ఆరో విడత లాక్ డౌన్ ఉండదని దాదాపుగా తేలిపోయింది. అయితే భారత్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటికే భారత్ లో ఐదున్నర లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రోజుకు ఇరవైై వేల కేసులు….
దీంతో పాటు రోజుకు ఇరవై వేల కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మరణాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం సెప్టెంబరు నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోట్లకు చేరుతుందన్న అంచనా కూడా ఉంది. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కనీసం ఆసుపత్రుల్లో వసతులను కూడా కల్పించలేకపోతున్నాయి.
రేపటితో ఐదో విడత…..
రేపటితో ముగియనున్న లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా కంటిన్యూ చేయకపోయినా కొన్ని రాష్ట్రాలు మాత్రం వాటంతట అవే లాక్ డౌన్ ను ప్రకటించుకున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జులై 31వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాటన పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నాయి.
అనేక రాష్ట్రాలు…..
జార్ఖండ్ రాష్ట్రంలోనూ లాక్ డౌన్ ఆంక్షలను జులై 31వ తేదీ వరకూ పొడిగించారు. కొన్ని రాష్ట్రాలు అంతరాష్ట్ర ప్రయాణాలపై నేటికి నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణల మధ్య రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. అసోం రాష్ట్రం కూడా జులై 12 వరకూ లాక్ డౌన్ ను విధించారు. మణిపూర్ లో జులై 15వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించాలని దాదాపుగా నిర్ణయించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఆరోవిడత లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా.. ప్రకటించకున్నా రాష్ట్రాలు మాత్రం తీవ్రతను బట్టి లాక్ డౌన్ ను ప్రకటిస్తుండటం విశేషం.