తగ్గుతున్న తెల్లోళ్ల జానాభా

అగ్రరాజ్యమైన అమెరికాకు సంబంధించిన ఏ విషయమైనా యావత్ ప్రపంచానికి ఆసక్తికరమే. ఎంత కాదనుకున్నా అగ్రరాజ్య పరిస్థితులు ఆయా దేశాలపై ఎంతో కొంత ప్రభావం చూపించే మాట వాస్తవం. [more]

Update: 2021-08-28 16:30 GMT

అగ్రరాజ్యమైన అమెరికాకు సంబంధించిన ఏ విషయమైనా యావత్ ప్రపంచానికి ఆసక్తికరమే. ఎంత కాదనుకున్నా అగ్రరాజ్య పరిస్థితులు ఆయా దేశాలపై ఎంతో కొంత ప్రభావం చూపించే మాట వాస్తవం. అందువల్ల అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంటుంది. తాజాగా అగ్రరాజ్య అమెరికా జనాభాకు సంబంధించిన వెలుగులోకి వచ్చిన లెక్కలు ఒకింత ఆశ్ఛర్యం కలిగించిన మాట నిజం. సహజంగా ఏ దేశంలో అయినా అక్కడి స్థానిక జనాభా పెరుగుతుంటోంది. ఇతర వర్గాల జనాభా తగ్గుతూ ఉంటుంది. కానీ అమెరికా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండ
టం ఆసక్తి కలిగిస్తోంది.

ప్రస్తుతానికి ఎక్కువగానే ఉన్నా…?

తాజాగా అమెరికా సెన్సస్ బ్యూరో విడుదల చేసిన లెక్కల ప్రకారం ఆ దేశంలోని తెల్లవారి జనాభా తగ్గింది. అదే సమయంలో ఇతర వర్గాల జనాభా పెరుగుతుండటం సరికొత్త పరిణామం. 1790 నుంచి అమెరికాలో జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. సరికొత్త లెక్కల ప్రకారం దేశంలో శ్వేత జాతీయుల సంఖ్య తగ్గింది. 2010లో వారి జనాభా 19.6 కోట్లుండగా ఇప్పుడు 19.10 కోట్లకు తగ్గింది. శాతాలవారీగా చూస్తే 63.7 నుంచి 5.8 శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో తెల్లవారి సంఖ్య తగ్గినప్పటికీ ఆధిక్యం మాత్రం వారిదే కావడం గమనార్హం. అదే సమయంలో అమెరికాయేతర ప్రజల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తికరం. ఆసియన్లు, స్పానిష్ – మెక్సికో మూలాలున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. జనాభాలో 18.7 శాతం మంది హిస్పానిక్ లే. వీరి సంఖ్య రమారమి 6.21 కోట్లు. ఆసియా వాసుల సంఖ్య గత దశాబ్ద కాలంలో మూడొంతులు పెరిగింది. వీరు 2.4 కోట్ల మంది ఉంటారని అంచనా.

33 కోట్ల జనాభాలో…?

మొత్తం అమెరికా జనాభా 33.14 కోట్లుగా తేలింది. చైనా, భారత్ ల తరవాత అతిపెద్ద జనాభా గల దేశంగా అగ్రరాజ్యం అమెరికా గుర్తింపు పొందింది. చాలామంది తాము ఏదో ఒక జాతివారమని చెప్పుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. తాము బహుళ జాతీయులమన్నది వారి భావన. అలాంటి వారి సంఖ్య 4.99 కోట్ల మంది వరకు ఉండవచ్చని అంచనా. గత పదేళ్లలో పల్లెల జనాభా తగ్గుతుండగా పట్టణాలు, నగరాల జనాభా పెరుగతుండటం మరో ఆసక్తికర పరిణామం. జనాభా పెరుగుదల మెట్రోపాలిటన్ నగరాల్లో మరీ ఎక్కువగా ఉంది. బతుకుదెరువు కోసం తట్టాబుట్ట సర్దుకుని ప్రజలు భారీగా వలస రావడమే ఇందుకు కారణం. జానాభా వద్ధి రేటు తగ్గడం వల్ల దాని ప్రభావం పిల్లలపైన పడుతోంది. 18 ఏళ్లున్న వయసున్న పిల్లల సంఖ్య పదేళ్ల క్రితం 7.42 కోట్లుండగా ఇప్పుడు ఆ సంఖ్య 7.31 కోట్లకు పడిపోవడమే ఇందుకు నిదర్శనం.

వలసలను ప్రోత్సహించడమేనా?

1.4 శాతం మేర తగ్గుదల కనిపిస్తోంది. అమెరికా జనాభాలో పిల్లల శాతం 22గా ఉంది. అదే సమయంలో పెద్దల జనాభాలో పెరుగుదల కనిపిస్తోంది. దశాబ్దం క్రితం వారి జనాభా 23.7 కోట్లుండగా ఇప్పుడు ఆ సంఖ్య 26.1 కోట్లకు పెరిగింది. శాతాలవారీగా చూస్తే 76 నుంచి 78 శాతానికి పెరగడం గమనార్హం. అమెరికాయేతర ప్రజల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం వలసలను ప్రోత్సహించడమే. విద్యా, ఉద్యోగ రంగా ల్లో విద్యార్థులను, ఉద్యోగుల రాకను అగ్రరాజ్యం ప్రోత్సహిస్తోంది. దీనివల్ల నాణ్యత గల మేథస్సు, ప్రతిభ తమ దేశానికి వస్తుందని, ఇది దేశ ప్రగతికి దోహదపడుతుందన్నది అమెరికా విధాన నిర్ణేతల భావన. దేశానికి వలస వచ్చని వారిలో కొందరు అక్కడే పౌరసత్వం తీసుకుని స్థిరపడిపోతున్నారు. దేశంలో అమెరికాయేతర పౌరుల సంఖ్య పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News