జగన్ ను ఆలీ కలసింది అందుకేనా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిత్యం బిజీగా ఉంటారు. ఆయన ఎమ్మెల్యేలకు, మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వరన్న టాక్ పార్టీలోనే ఉంది. జగన్ ను కలవాలని ఏడాదిగా ఎదురు [more]

Update: 2020-09-21 09:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిత్యం బిజీగా ఉంటారు. ఆయన ఎమ్మెల్యేలకు, మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వరన్న టాక్ పార్టీలోనే ఉంది. జగన్ ను కలవాలని ఏడాదిగా ఎదురు చూస్తున్నామని ఒక ఎంపీ వ్యాఖ్య ఇందుకు ఉదాహరణ. అయితే సినీనటుడు ఆలీ ఇటీవల జగన్ ను కలవడం వైసీపీలో చర్చనీయాంశమైంది. ఆలీ దాదాపు అరగంట పాటు జగన్ ను కలసి చర్చించారు. ఈ విషయం టాలీవుడ్ తో పాటు వైసీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

గత ఎన్నికలకు ముందు……

సినీనటుడు ఆలీ గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరడానికి ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేనలో చేరతారని అందరూ భావించారు. కానీ ఆలి వైసీపీలో చేరడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నికల సమయంలో ఆలి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ తరుపున ప్రచారం కూడా చేశారు. అయితే గత పదిహేను నెలలుగా ఆలీకి వైసీపీలో ఎటువంటి ప్రాధాన్యత లభించలేదు.

అవకాశాలు లేక….

ఆలీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే తనకు ఏదైనా నామినేటెడ్ పోస్టు దక్కుతుందని భావించారు. కానీ అటువంటి సంకేతాలు ఇప్పటి వరకూ లేవు. మరోవైపు టాలీవుడ్ లో ఆలీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇందుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. టీవీ షోలు తప్ప ఇప్పుడు ఆలీకి సినిమా అవకాశాలు ఏమీ లేవు. వైసీపీలో చేరినందునే తనను సినీ ఇండ్రస్ట్రీ దూరం పెట్టిందని ఆలీ భావిస్తున్నారు.

నామినేటెడ్ పోస్టు ఇస్తానని….

ఇదే విషయంపై చర్చించేందుకు జగన్ ను ఆలీ కలిశారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. తనకు సినీ ఇండ్రస్ట్రీలో జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా ఆలీ జగన్ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తనకు ఉన్న ఇబ్బందులను కూడా ఆలీ జగన్ వద్ద ఏకరువు పెట్టారని అంటున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ ఆలీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆలికి నామినేటెడ్ పోస్టు ఇస్తారన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

Tags:    

Similar News