పళనికి జగన్ పంటికింద రాయిలా మారారా?
తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెట్టిన మంట ఇప్పుడు కాక రేపుతుంది. అక్కడ కూడా బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. [more]
తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెట్టిన మంట ఇప్పుడు కాక రేపుతుంది. అక్కడ కూడా బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. [more]
తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెట్టిన మంట ఇప్పుడు కాక రేపుతుంది. అక్కడ కూడా బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. తమిళనాడు ఎన్నికలు ఉండటంతో అధికార పార్టీ కూడా ఇబ్బందుల్లో పడింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో జగన్ బీసీ కులాలకు మొత్తం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
బీసీ కులాల కోసం….
ఎన్నికల సమయం కావడంతో బీసీ కులాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు బీసీ ఓటర్లపైనే ఆధారపడి ఏళ్లుగా రాజకీయం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ఇక్కడ పార్టీలను ఇబ్బందుల్లో పడేసిందంటున్నారు. పొరుగు రాష్ట్రంలో అమలు కావడంతో తమకు కూడా సేమ్ టు సేమ్ అమలు చేయాలని ఎక్కుమంది కోరుతున్నారు.
కులాల వారీగా కార్పొరేషన్లు…..
ఇందులో ప్రధానంగా పీఎంకే అధినేత రాందాస్ తమిళనాడులో పట్టున్న నేత. పీఎంకే కనీస ఓట్లను సాధించే పార్టీ అన్న పేరుంది. వన్నియార్ల మద్దతు పీఎంకే గత కొన్నేళ్లుగా రాజకీయాలు నడుపుతుంది. ఇప్పుడు రాందాస్ సయితం వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు కూడా కులాల వారీగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాందాస్ డిమాండ్ చేస్తున్నారు.
పీఎంకే ప్రధాన డిమాండ్…..
ప్రస్తుతం పీఎంకే తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిలో ఉంది. అయితే రాందాస్ రజనీకాంత్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు. రజనీకాంత్ పార్టీపెడితే అందులో భాగస్వామి కావాలని భావిస్తున్నారు. పీఎంకే ఉపముఖ్యమంత్రి పదవితో పాటు అధికారంలో వాటా ను కోరుతుంది. అన్నాడీఎంకేలో అది సాధ్యం కాకపోవడంతో రజనీకాంత్ పార్టీ కోసం రాందాస్ చూస్తున్నారు. మరోవైపు బీసీ కులాల కార్పొరేషన్లు, వన్నియార్ల రిజర్వేషన్లపై ఆయన పోరాటం చేస్తున్నారు. మొత్తం మీద తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వాన్ని పొరుగునే ఉన్న జగన్ ఇరకాటంలో పడేశారనే చెప్పాలి.