కాశ్మీర్ కల ఇక అందరిదీ…?
జమ్ము కశ్మీర్… కారణాలు ఏమైనప్పటికీ ఇప్పటివరకు ఈ సరిహద్దు రాష్ర్టం, సుందర రాష్ర్టం సంపూర్ణంగా భారతీయుల జన జీవన స్రవంతిలో భాగం కాలేకపోయింది. సగటు భారతీయుడి ఆశలు, [more]
జమ్ము కశ్మీర్… కారణాలు ఏమైనప్పటికీ ఇప్పటివరకు ఈ సరిహద్దు రాష్ర్టం, సుందర రాష్ర్టం సంపూర్ణంగా భారతీయుల జన జీవన స్రవంతిలో భాగం కాలేకపోయింది. సగటు భారతీయుడి ఆశలు, [more]
జమ్ము కశ్మీర్… కారణాలు ఏమైనప్పటికీ ఇప్పటివరకు ఈ సరిహద్దు రాష్ర్టం, సుందర రాష్ర్టం సంపూర్ణంగా భారతీయుల జన జీవన స్రవంతిలో భాగం కాలేకపోయింది. సగటు భారతీయుడి ఆశలు, ఆకాంక్షలకూ దూరంగానే ఉండిపోయింది. కాశ్మీర్ పై తమకు ఎంత అభిమానం ఉన్నప్పటికీ భారతీయులకు అక్కడ నివసించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఇది చరిత్రగా, గత కాలపు చేదు గుర్తుగా మిగిలి పోనుంది. ఇకనుంచి కాశ్మీర్ లో ప్రతి భారతీయుడూ స్వేచ్ఛగా సంచరించవచ్చు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆస్తులు సమకూర్చకోవచ్చు. భూములు కొనుక్కోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర రాష్రాల్లో ఉన్నట్లే ఇక్కడా ఉండవచ్చు. 370 అధికరణ రద్దుతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సంపూర్ణ ఫలితాలు……
గతఏడాది ఈ అధికరణను రద్దు చేసినప్పటికీ దాని సంపూర్ణ ఫలితాలు ఇప్పుడే వస్తున్నాయి. ఈ సంక్షోభిత రాష్ర్టం ఇప్పుడు సంపూర్ణంగా భారత్లో అంతర్ భాగం అయింది. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను గత ఏడాది ఆగస్టులో కేంద్రం రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 370 అధికరణ ఓ రకంగా రాష్ర్ట ప్రగతికి అడ్డంకిగా మారిందన్నది చేదునిజం. తాజాగా కాశ్మీర్లో పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ భూమి చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. రాష్ర్ట అభివృద్ధి చట్టం సెక్షన్ 17లోని ‘రాష్ర్ట శాశ్వత పౌరులకు మాత్రమే’అనే పదాన్ని తొలగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పు తక్షణం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం రాష్ర్ట చరిత్రలో నూతన అధ్యాయమని, ఇది రాష్ట్ర ప్రగతికి దోహదపడుతుందన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రగతికి…..
జమ్ము కశ్మీర్ అభివద్ధి చట్టం 1970ని కూడా కేంద్రం సవరించింది. దీనివల్ల పరిశ్రమల కోసం భూమిని సేకరించడం, విక్రయించడం, లీజుకివ్వడంతో పాటు పారిశ్రామిక అభివద్ధి కోసం వేగవంతంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది రాష్ర్ట పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థిరాస్తి రంగం, ఆతిధ్య రంగం ఇక్కడ అభివద్ధి చెందే అవకాశం ఉంది. మహారాష్ర్ట ప్రభుత్వం రెండు రిసార్ట్లను , కర్టాటక ప్రభుత్వం లోయలో ఒక లగ్జరీ హోటల్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. ప్రభుత్వ నిర్ణయంపై సహజంగానే కాశ్మీరీ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వ్యతిరేకించాయి. ఇది కాశ్మీర్ ను తాకట్టు పెట్టడమే అని వ్యాఖ్యానించాయి. అయితే జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ సైతం వ్యతిరేకించడం ఆశ్ఛర్యం కలిగించింది. కేంద్రంలోని అధికార భాజపా తన సహజ వైఖరికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. కాశ్మీరీ పండిట్లు ఆహ్వాని స్తున్నారు.
కాశ్మీర్ పండిట్ల రాకతో…..
రాష్రేతరులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచు కోవడం వల్ల జనాభా నిష్పత్తిలో మార్పులు వస్తాయి. ఇప్పటివరకు కొందరు స్థానికులు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్రాల వారు ఇక్కడకు రావడాన్ని పక్కనపెడితే ముందుగా 1990ల్లో వరుస ఊచకోతల కారణంగా వలస వెళ్లిన కాశ్మీరీ పండితులను రప్పించాలన్న అభిప్రాయం బలంగా వినపడుతోంది. వీరు చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొట్టపోసుకుంటున్నారు. పండితుల పునరాగమనంతోనే కాశ్మీర్ కు సంపూర్ణత చేకూరుతుంది. రాష్రం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. కేంద్రం ఈ విషయంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కశ్మీర్ అన్ని రాష్రాల మాదిరిగా ప్రగతి పథంలో దూసుకు పోగలదు.
-ఎడిటోరియల్ డెస్క్