అందరూ దూరమవుతున్నారుగా?

భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ అంతా గడ్డుకాలంగానే కన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ వర్గాన్ని సంతృప్తిపర్చకపోగా తీవ్ర అసంతృప్తిని మిగులుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ [more]

Update: 2021-04-23 17:30 GMT

భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ అంతా గడ్డుకాలంగానే కన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ వర్గాన్ని సంతృప్తిపర్చకపోగా తీవ్ర అసంతృప్తిని మిగులుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకత కన్పిస్తుందంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇక రాష్ట్రాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుజరాత్ లో మినహా బీజేపీ ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు.

మోడీ నిర్ణయాలు…..

దీనికి ప్రధాన కారణం మోదీ తీసుకుంటున్న మొండి నిర్ణయాలేనని చెబుతున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఉపాధి లేక అవస్థలు పడ్డారు. వ్యాపారాలుపూర్తిగా దెబ్బతిన్నాయి. అయినా ఏమాత్రం మోదీ ప్రభుత్వానికి కనికరం లేదు. పెట్రోల్ ధరలు పెంచడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ఎరువుల ధరలు పెరగడం కూడా భవిష‌్యత్ లో ధాన్యం ధర పెరుగుదలకు కారణమవుతుందంటున్నారు.

అన్ని వర్గాలనుంచి….

అందుకే రైతుల నుంచి ఉద్యోగ, కార్మిక వర్గాలేవీ మోదీ ప్రభుత్వానికి సానుకూలంగా లేవు. ఇటీవల జరిగిన పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ చావుదెబ్బ తినింది. కానీ మోదీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నా వారిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తుండటంతో కార్మిక, ఉద్యోగ సంఘాలు మోదీ ప్రభుత్వంపై మండి పడుతున్నాయి.

తాజాగా త్రిపురలోనూ….

ఇటీవల త్రిపుర గిరిజన మండలి ఎన్నికల్లోనూ బీజేపీ కూటమి దెబ్బతినింది. త్రిపురలో అధికారంలో ఉన్నప్పటికీ గిరిజన మండలి ఎన్నికల్లో ఆధిక్యత సాధించలేకపోయింది. 2018 ఎన్నికల్లో 18 నియోజకవర్గాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. కానీ ఈసారి పట్టును నిలుపుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వ నిర్ణయాలేనంటున్నారు. అన్ని వర్గాలు క్రమంగా కమలం పార్టీకి దూరమవుతున్నాయనడానికి ఇదే నిదర్శనం.

Tags:    

Similar News