Ys jagan : దానితోనే సరిపెట్టుకోవాలా?

తొలి నుంచి జగన్ ను నమ్ముకున్న వారికి ఈసారి మంత్రి పదవి దక్కనుందా? సామాజిక సమీకరణాలు వారి పదవులకు అడ్డుపడతాయా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. పార్టీలో [more]

Update: 2021-11-08 08:00 GMT

తొలి నుంచి జగన్ ను నమ్ముకున్న వారికి ఈసారి మంత్రి పదవి దక్కనుందా? సామాజిక సమీకరణాలు వారి పదవులకు అడ్డుపడతాయా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. పార్టీలో సీనియర్ నేత, జగన్ కు నమ్మకమైన మిత్రుడుగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి కి ఈసారి మంత్రి పదవి దక్కడంపై సందేహం నెలకొంది. రెడ్డి సామాజికవర్గం కావడంతోనే ఆయనకు పదవి లభించే ఛాన్స్ లేదంటున్నారు. ఆయనతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయి పరిస్థితిని వివరించే అవకాశముందటున్నారు.

తొలి నుంచి….

కడప జిల్లాలో గడికోట శ్రీకాంత్ రెడ్డి తొలి నుంచి వైసీపీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జగన్ పార్టీ పెట్టిన తర్వాత రాజీనామా చేసి జగన్ కు అండగా నిలిచారు. రాయచోటి నుంచి ఇప్పటికే నాలుగు సార్లు గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించి జిల్లాలో సీనియర్ గా నిలిచారు. మంత్రి పదవి కోసం ఆయన తొలి సారి ఆశించినా దక్కలేదు. ఈసారి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి లభిస్తుందని గడికోట శ్రీకాంత్ రెడ్డి భావిస్తున్నారు.

సామాజికవర్గం కోణంలో….

జగన్ తన సొంత జిల్లా కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా తాను ఉన్నారు. ఇక మరొకరికి మాత్రమే జిల్లా నుంచి కేబినెట్ లో చోటు లభించే అవకాశముంది. తొలిసారి అంజాద్ భాషాకు మైనారిటీ కోటాలో మంత్రిపదవి ఇచ్చారు. ఈసారి అంజాద్ భాషాను తప్పించడం ఖాయం. ఆయన స్థానంలో మరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మరో రెడ్డికి ఇచ్చే అవకాశం లేదు. రెడ్డి సామాజికవర్గంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డిలు పోటీ పడుతున్నారు.

ఆ పదవితోనే…..?

కానీ వీరెవ్వరికీ ఈసారి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం లేదు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కూడా తొలి నుంచి జగన్ ను నమ్ముకుని ఉన్నారు. ఎస్సీ కోటాలో ఆయనకు పదవి దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. గడికోట శ్రీకాంత్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా జగన్ చీఫ్ విప్ పదవిని ఇచ్చారు. దానితోనే సరిపెడతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఈసారి కూడా మంత్రి పదవి ఆశలు నెరవేరేటట్లు లేదు.

Tags:    

Similar News