బాబు నెత్తిన పెట్టుకున్నారేంటి?

రాజ‌కీయాల్లో నాయ‌కుల వ‌ల్ల పార్టీకి, పార్టీ వ‌ల్ల నాయ‌కుల‌కు ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం ఉండాలి. అలాకాకుండా కేవ‌లం పార్టీని నాయకులు కానీ, నాయ‌కుల వ‌ల్ల పార్టీ కానీ ఏక‌ప‌క్షంగా [more]

Update: 2019-10-25 06:30 GMT

రాజ‌కీయాల్లో నాయ‌కుల వ‌ల్ల పార్టీకి, పార్టీ వ‌ల్ల నాయ‌కుల‌కు ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నం ఉండాలి. అలాకాకుండా కేవ‌లం పార్టీని నాయకులు కానీ, నాయ‌కుల వ‌ల్ల పార్టీ కానీ ఏక‌ప‌క్షంగా ఎన్నాళ్లు ప్ర‌యోజ‌నం పొందుతారు. ఇలా పొందినా .. అది ఎన్నాళ్లు నిలుస్తుంది? మిగిలిన వారు ప్ర‌శ్నించ‌రా? ఇప్పుడు ఇదే ప్ర‌శ్న టీడీపీలో సీనియ‌ర్ల నుంచి రైజ్ అవుతోంది. విష‌యంలోకి వెళ్తే.. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులను ప్ర‌క‌టించారు. దీనిలో గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఈ నిర్ణ‌యాన్ని సీనియ‌ర్లు త‌ప్పుప‌డుతున్నారు. గ‌ల్లా కుటుంబంతో పార్టీకి ఒన‌గూరిన ప్ర‌యోజ‌నం ఏంటో ఆలోచించు బాబూ అంటూ సూచిస్తున్నారు.

అధిక ప్రాధన్యం ఇస్తున్నారంటూ….

గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబానికి చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా పార్టీలో వినిపిస్తున్నాయి. గ‌ల్లా మాతృమూర్తి గ‌ల్లా అరుణ‌కు చిత్తూరు జిల్లాలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జిల్లా మాట అటుంచితే.. ఆమె కాంగ్రెస్‌లో ఉండ‌గా విజ‌యం సాధించిన చంద్ర‌గిరిలోనే టీడీపీని బ‌తికించే ప‌రిస్థితి లేకుండా పోయింది. అయినా కూడా ఆమెకు ప‌గ్గాలు అప్ప‌గించారు. ఇక‌, గుంటూరు ఎంపీగా 2014లో గ‌ల్లా జ‌య‌దేవ్‌ను తెర‌మీదికి తెచ్చారు. ఇక్క‌డి టికెట్ ఇచ్చారు. గెలిపించారు. అయితే, ఆయ‌న అప్ప‌ట్లోనే నియోజ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉండ‌ర‌ని, త‌న వ్యాపారాల‌తో మునిగి తేలుతుంటార‌నే ప్ర‌చారం ఉంది.

పార్టీకి ప్రయోజనం లేదంటూ…

ఒక‌టి రెండుసార్లు పార్ల‌మెంటులో మిస్ట‌ర్ ప్రైమ్‌మినిస్ట‌ర్ అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌తో హైలెట్ కావ‌డం మిన‌హా ఆయ‌న ఆయ‌న అటు పార్టీకి ఆయ‌న వ‌ల్ల ఎలాంటి యూజ్ అవ్వ‌లేదు. ఇక‌, 2019లోనూ ఆయ‌న‌కే టికెట్ ఇచ్చి గెలిపించ‌డంపై స్థానికంగా నాయ‌కులు చిర్రుబుర్రులాడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్నే కాకుండా పార్టీ ఏమైనా కూడా గ‌ల్లా కుటుంబం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, తాము గెలిస్తే.. చాల‌ని, పార్టీ ఏమైనా ప‌ర్వాలేద‌నే విధంగా గ‌ల్లా ఫ్యామిలీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు. గుంటూరు జిల్లాలో కొంద‌రు మాజీ మంత్రులు ఇప్ప‌టికే గ‌త ఎన్నిక‌ల్లో గ‌ల్లా ఒంటెద్దు పోక‌డ‌ల‌పై బాబుకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కూడా వారు మ‌న‌స్థాపంతో ఉన్నారు. ఇక సొంత జిల్లా చిత్తూరులో పార్టీ నాశనం అయిపోయింది గ‌ల్లా ఫ్యామీలీ వ‌ల్ల కాదా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. అయినా కూడా గ‌ల్లా కుటుంబాన్ని బాబు నెత్తిన పెట్టుకుంటున్నార‌ని నిష్టూరంగా మాట్లాడుతున్నారు.

విజిటింగ్ ఎంపీ అంటూ….

ఇక ఇటు గుంటూరులోనూ అదే ప‌రిస్థితి ఉంది. విజిటింగ్ ఎంపీగా ఉంటూ క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌ను, నేత‌ల‌ను, పార్టీని కూడా ప‌ట్టించుకోకుండా గ‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు. పార్టీ ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నా కేడ‌ర్‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని…. పార్టీకి స్థానికంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదని నాయ‌కులు అంటున్నారు. అయినా కూడా చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌ల‌ను విని కూడా విన‌న‌ట్టే త‌న‌మానాన త‌ను ముందుకు వెళ్ల‌డం వ‌ల్ల పార్టీకే అంతిమంగా న‌ష్టం చేకూరుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి చంద్రబాబు ఇప్ప‌టికైనా గ‌ల్లా ఫ్యామిలీకి ఇచ్చే ప్ర‌యార్టీ విష‌యంలో పున‌రాలోచిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News