నయీం కేసు అటకెక్కినట్లేనా?

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పురోగతి లేదు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత జరిగిన విచారణ వన్ సైడ్ గా జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. నయీంకు సహకరించిన పోలీసు [more]

Update: 2020-06-27 18:29 GMT

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో పురోగతి లేదు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత జరిగిన విచారణ వన్ సైడ్ గా జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. నయీంకు సహకరించిన పోలీసు అధికారులను కూడా వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఇటీవల ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లోక్ పాల్ కు లేఖ రాసింది. లోక్ పాల్ చట్టం కింద నయీం కేసును విచారించాలని వారు కోరుతున్నారు. నయీం కేసులో ఇప్పటి వరకూ ఆస్తుల విషయం తేలలేదు.

నాలుగేళ్లవుతున్నా……

గ్యాంగస్టర్ నయీం 2016లో ఎన్ కౌంటర్ అయ్యారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆయన డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. నయీం కేసులో సిట్ మొత్తం 107 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. నయీం బాధితులకు సంబంధించి ఇప్పటి వరకూక 250 కేసులు నమోదయి ఉన్నాయి. మరో 29 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

డైరీలో దొరికిన….

అయితే నయీం వద్ద లభించిన డైరీలో అనేక విషయాలు ఉన్నాయంటున్నారు. నయీం పెద్దయెత్తున నగదుతో పాటు బంగారం, భూములను సెటిల్ మెంట్ల ద్వారా కొనుగోలు చేశారు. ఒక డంప్ కూడా దొరికిందన్న ప్రచారం ఉంది. నయీం అనుచరుల దద్గరే 2.16 కోట్ల రూపాయల నగదు లభించింది. దీంతో పాటు రెండు కిలోల బంగారం, రెండు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నయీంకు మొత్తం 1,050 ఎకరాల భూమి ఉన్నట్లు సిట్ విచారణలో తేలింది.

సీబీఐకి అప్పగించాలని…..

నయీం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహరాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, గోవాల్లోనూ లింకులున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపుగా 25 మంది పోలీసు అధికారులకు నయీం తో సంబంధాలున్నట్లు తేలింది. అడిషనల్ ఎస్సీలు ఇద్దరు, ఏడుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, 14 మంది సీఐలు ఉన్నారు. తొమ్మిది మంది రాజకీయనాయకులకు కూడా నయీంతో సంబంధాలున్నాయని తేలింది. అయినా వీరిపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతుంది. నయీం కేసులో చిక్కు ముడులు తొలగించి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తుంది.

Tags:    

Similar News