సెకండ్ ఇన్నింగ్స్ దీంతోనే స్టార్ట్ చేస్తారా?
నాయకుడు అన్న వాడు సరైన సమయం కోసం ఎదురుచూస్తాడు. ఆ సమయం రాగానే జూలు విదిలించి రంగంలోకి దూకుతాడు. చాన్నాళ్ళుగా పొలిటికల్ గా సీన్ లో లేని [more]
నాయకుడు అన్న వాడు సరైన సమయం కోసం ఎదురుచూస్తాడు. ఆ సమయం రాగానే జూలు విదిలించి రంగంలోకి దూకుతాడు. చాన్నాళ్ళుగా పొలిటికల్ గా సీన్ లో లేని [more]
నాయకుడు అన్న వాడు సరైన సమయం కోసం ఎదురుచూస్తాడు. ఆ సమయం రాగానే జూలు విదిలించి రంగంలోకి దూకుతాడు. చాన్నాళ్ళుగా పొలిటికల్ గా సీన్ లో లేని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా బయటకు వచ్చారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆయన నినదించడమే కాదు, విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం ఎందాకైనా అంటూ గట్టిగానే గర్జించారు. అవసరం అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని కూడా గంటా శ్రీనివాసరావు గంభీరమైన ప్రకటనే చేశారు. గంటాశ్రీనివాసరావు అన్నంత పనిచేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
విశాఖ గుండె చప్పుడు …
ఇంతకీ గంటా ఏం చేయదలచుకున్నారు. ఆయన కార్యచరణ ఏంటి అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఇది నిజమే. విశాఖవాసులకు స్టీల్ పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది. సెంటిమెంట్ కూడా ఉంది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగించాలని అంతా కోరుకుంటున్నారు. ఇదే మాట గంటా శ్రీనివాసరావు చెబుతూ విశాఖ వాసుల గుండె చప్పుడు అయిన ఉక్కు పరిశ్రమను పరాయి వాళ్లకు కట్టబెడతారా అంటూ ఆగ్రహిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ పేరు మీదనే ఉక్కు నగరం అని కూడా ఏర్పడింది ఆయన అంటున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కోసం తాను ముందుకు వస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా అంతా చేతులు కలపాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇందుకు నాన్ పొలిటికల్ జేఏసీ ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదే సమయం….
ఇదిలా ఉండగా గంటా శ్రీనివాసరావు వంటి నాయకుడు రెండేళ్ల పాటు ఏ రకంగానూ మీడియాకు కనబడకుండా తన యాక్టివిటీని పూర్తిగా తగ్గించేసుకుని ఇంటికి పరిమితం కావడం అంటే విశేషమే అని చెప్పుకోవాలి. అదే సమయంలో ఆయన ఏ పార్టీతోనూ ఇపుడు సంబంధాలు పెట్టుకోవడంలేదు. తాను గెలిచిన తెలుగుదేశంలోనూ ఆయన చురుకుగా లేరు. అందుకే ఆయన టీడీపీ పేరు ఎక్కడా ప్రస్తావించడంలేదు. రాజకీయాలు, పార్టీలు, జెండాలు వీడి అంతా ఒక్కటిగా ముందుకు కదిలితేనే విశాఖ ఉక్కుని రక్షించుకోగలమని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. తాను మళ్లీ ప్రజల పక్షాల ఉంటూ రాజకీయంగా రాణించేందుకు ఇదే సరైన సమయం అని కూడా గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్లుగా ఉన్నారు.
ఉక్కు సంకల్పమేనా…?
విశాఖ ఉక్కు అన్నది జనాలలో ఉన్న అతి పెద్ద సెంటిమెంట్, విశాఖ ఉక్కు ఎక్కడికీ తరలిపోదు అని బీజేపీ నేతలు చెబుతున్నా కూడా అది ప్రభుత్వ రంగంలో ఉంటే మాదీ అన్న భావన జనాల్లో ఉంటుంది. ప్రైవేట్ వారికి ఇస్తే కచ్చితంగా అది జనాల మనసుల నుంచి దూరం అవడం ఖాయం. ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద వామపక్షాలు సహా అన్ని పార్టీలు భగ్గుమంటున్నాయి. దాంతో గంటా శ్రీనివాసరావు ముందుకు వచ్చి తన అజెండా ఏంటో చెప్పేశారు. మరి ఫ్యూచర్ లో గంటా ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఉక్కుని నమ్ముకుని పాలిటిక్స్ లో తనదైన సెకండ్ ఇన్నింగ్స్ ఆయన చేపడతారా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.