గంటా రూట్ లోకి మాజీ శిష్యులు…?
ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఉత్తరాంధ్రా జిల్లాల్లో స్ట్రాంగ్ పొలిటీషియన్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన రాజకీయం కూడా విలక్షణంగా ఉంటుంది. ఆయన [more]
ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఉత్తరాంధ్రా జిల్లాల్లో స్ట్రాంగ్ పొలిటీషియన్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన రాజకీయం కూడా విలక్షణంగా ఉంటుంది. ఆయన [more]
ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఉత్తరాంధ్రా జిల్లాల్లో స్ట్రాంగ్ పొలిటీషియన్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన రాజకీయం కూడా విలక్షణంగా ఉంటుంది. ఆయన నోరు విప్పి ఎవరి మీద హార్ష్ గా విమర్శలు చేయరు. తనను పదే పదే మాటలు అంటున్నా కూడా ప్రత్యర్ధుల విషయంలో ఆయన సహనమే పాటిస్తారు. ఎపుడు ఎవరితో ఏ అవసరం ఉంటుందో అన్నదే ఆయన దూరాలోచన. ఆ లౌక్యమే గంటా శ్రీనివాసరావు పొలిటికల్ కెరీర్ సక్సెస్ కావడానికి కారణం అని కూడా అంటారు. ఇదిలా ఉంటే గంటా బ్యాచ్ ఒకప్పుడు మూడు జిల్లాలలో కళకళలాడేది. కానీ కొన్నేళ్ళుగా వారంతా చెల్లాచెదురు అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఎవరి దారి వారి చూసుకున్నారు.
ఇక కలివిడిగానే …?
విశాఖ జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా గంటా శ్రీనివాసరావు బ్యాచ్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా వివిధ కారణాల వల్ల విడిగానే ఇపుడు రాజకీయం చేస్తున్నారు. కొందరు అయితే వైసీపీలో చేరిపోయారు. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచాయి. ఇక అన్ని రకాల ఎన్నికలు కూడా ముగిసాయి. కొన్ని చోట్ల మాత్రమే నామినేటెడ్ పదవుల పంపిణీ ఒకటీ అరా అలా మిగిలి ఉంది. అది కనుక పూర్తి అయితే వైసీపీ నుంచి ఏ రకమైన ఆశలు ఉండవు అంటున్నారు. అవన్నీ చూసుకున్న మీదట గంటా శ్రీనివాసరావు బ్యాచ్ మళ్లీ ఆయన దగ్గరకే వస్తారు అన్న మాట అయితే వినిపిస్తోంది.
దిగాలుగానే అలా…?
విశాఖ జిల్లాలో చూసుకుంటే గంటా శ్రీనివాసరావు బ్యాచ్ లో మాజీ ఎమ్మెల్యేలు ఎస్ ఎ రహమాన్, పంచకర్ల రమేష్ బాబు, తిప్పల గురుమూర్తి రెడ్డి వంటి వారు ఉన్నారు. అలాగే విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగా రావు కూడా జై గంటా అంటారు. మాజీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు వంటి వారు కూడా గంటా గూటి పక్షులుగానే చలామణీ అవుతూ వచ్చారు. ఇక శ్రీకాకుళం లో చూసుకుంటే కళా వెంకటరావుతో కూడా గంటా శ్రీనివాసరావుకు మంచి దోస్తీ ఉంది. వీరంతా ఇపుడు విడిగానే ఉంటున్నారు. విశాఖలో మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చకోర పక్షులుగా పదవుల వేటలో ఉన్నారు. వారికి కనుక అక్కడ అన్యాయం జరిగితే మాత్రం మళ్ళీ గురువు నీడకే వచ్చి చేరుతారు అని అంటున్నారు.
గుత్తమొత్తంగానే …?
గంటా శ్రీనివాసరావు రాజకీయమే అలా ఉంటుంది. ఆయన ఏ పార్టీలో చేరినా, లేక ఉన్న పార్టీలో గట్టిగా నిలబడాలన్నా తన బ్యాచ్ నే బలంగా చూపిస్తారు. మరో మూడేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. గట్టిగా చెప్పలంటే చివరి ఏడాదే ఎన్నికల వేడి మొదలవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే గంటా శ్రీనివాసరావు పావులు కదుపుతారు అని అంటున్నారు. అందువల్ల గంటా బ్యాచ్ గా ఉంటే మాత్రం అందరినీ తాను ఉన్న పార్టీలో అకామిడేట్ చేయడానికే గంటా మొగ్గు చూపుతారు అంటున్నారు. ఆ విషయంలో ఆయన ముందే బేరం కుదుర్చుకునే అధినాయకత్వాలను ఒప్పిస్తారు అంటున్నారు. ఇపుడు విడిగా ఉంటున్నా ఏదో రోజున గంటా బ్యాచ్ అంతా ఒక్కటి అవడం ఖాయమన్న మాట అయితే ఉత్తరాంధ్రా జిల్లాల్లో కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావుకు కూడా తన రాజకీయం పటిష్టం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ దగ్గరకు చేరదీస్తారు అంటున్నారు. మొత్తానికి గంటా బ్యాచ్ మళ్లీ స్ట్రాంగ్ అయితే అది ప్రత్యర్ధులకు ఇరకాటమే అని చెప్పాలి మరి.