వేటు పడుతున్న వేళ నోట మాట రాదేం… ?

ఎపుడో అయిదు నెలల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం బయటకు వచ్చింది. అంతే ఉన్న ఉదుటున విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు [more]

Update: 2021-07-13 05:00 GMT

ఎపుడో అయిదు నెలల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం బయటకు వచ్చింది. అంతే ఉన్న ఉదుటున విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తనతో పాటు మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేయాలని కేంద్రం మీద వత్తిడి తేవాలని ఆయన కోరారు. అయితే గంటా శ్రీనివాసరావు చేసిన పనికి షాక్ తిన్న టీడీపీ కూడా ఆయనకు సహకరించలేదు. మరో వైపు వైసీపీ అయితే అసలు ఈ డిమాండ్ ని పట్టించుకోలేదు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద రాజీనామా చేసిన ఏకైక ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు చరిత్రలో నిలిచారు.

వత్తిడి తెచ్చి మరీ ….?

గంటా శ్రీనివాసరావు అంతటితో ఊరుకోలేదు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఉన్న ఆముదాలవలసకు వెళ్ళి మరీ తన రాజీనామాను ఆమోచించుకోవాలి వత్తిడి తెచ్చారు. అది జరిగి కూడా నాలుగు నెలలు అయింది. కానీ ఇప్పటిదాకా గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందలేదు. అయితే స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చిన ఆయన రాజీనామా అలాగే ఉంది. దాంతో గంటా శ్రీనివాసరావు కూడా సైలెంట్ అయ్యారు. ఈ లోగా కరోనా రెండవ దశ వీరవిహారం చేయడంతో అంతా ఆ ఊసు మరిచారు. అయితే ఇపుడు కేంద్రం దూకుడు పెంచేసింది. విక్రయ ప్రక్రియను తొందరలోనే పూర్తి చేయాలనుకుంటోంది.

ఉలుకూ పలుకేదీ…?

విశాఖకు జాతీయ వామపక్ష నాయకులు వస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ప్రైవేటీకరణ చేయవద్దని కూడా వారు గట్టిగా కోరుతున్నారు. ఉక్కు కార్మికులు అయితే భారీ ర్యాలీలు నిర్వహించి మరీ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. మరో వైపు ఢిల్లీ వెళ్ళి ఉద్యమించడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఇంత జరుగుతున్నా కూడా గంటా శ్రీనివాసరావు మాత్రం ఎక్కడా ఒక్క మాట లేకుండా అలాగే ఉన్నారు. ఆయన కనీసం ఉక్కు పోరాట శిబిరం వైపుగా కూడా తొంగి చూడడంలేదు. మరి ఉక్కు కోసమే రాజీనామా చేశాను అని చెప్పిన ఆయన ఎందుకిలా ఉన్నారు అన్నది కార్మికులకే అర్ధం కావడంలేదు.

వట్టి స్టంటేనా..?

గంటా శ్రీనివాసరావు పొలిటికల్ స్టంట్ కోసమే విశాఖ ఉక్కుని వాడుకున్నారా అన్న చర్చ కూడా ఉందిపుడు. ఉక్కు పోరాట యోధుడిగా కలరింగ్ ఇచ్చిన ఆయన క్లైమాక్స్ సీన్ లో కనిపించకపోవడం ఏంటి అని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఉక్కు ఎటూ ప్రైవేట్ పరం అవుతుందని తెలిసే గంటా శ్రీనివాసరావు ఇలా మిన్నకున్నారా అన్న మాటా ఉంది. ఏది ఏమైనా ఆదికి ముందే అరవీర భయంకర వీరుడిగా అవతారం ఎత్తిన మాజీ మంత్రి సరైన టైమ్ లో కామప్ అయిపోవడం ద్వారా తన ఇమేజ్ ని బాగా తగ్గించేసుకున్నారు అన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News