Ganta : మరోసారి జంప్ కు సిద్దమయినట్లేనా?

గంటా శ్రీనివాసరావు సీనియర్ నేత. ఆయన తెలుగుదేశం పార్టీకి చాలా కాలం నుంచి దూరంగా ఉన్నారు. ఒక రకంగా గంటా టీడీపీలో లేనట్లే. ఆయన ఉన్నానని అనుకున్నప్పటికీ [more]

Update: 2021-10-11 13:30 GMT

గంటా శ్రీనివాసరావు సీనియర్ నేత. ఆయన తెలుగుదేశం పార్టీకి చాలా కాలం నుంచి దూరంగా ఉన్నారు. ఒక రకంగా గంటా టీడీపీలో లేనట్లే. ఆయన ఉన్నానని అనుకున్నప్పటికీ అది భ్రమ పడినట్లే. పార్టీని ఆయన ఎంతదూరం పెట్టారో.. గంటా శ్రీనివాసరావును కూడా పార్టీ అంతే దూరం పెట్టింది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు.

రాజీనామా చేసినా….?

గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా దానిని స్పీకర్ ఇంతవరకూ ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించే అవకాశాలు కూడా లేవు. గంటా శ్రీనివాసరావు కావాలనే ఇలా చేశారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. ఆయన గెలిచిన విశాఖ ఉత్తర నియోజకవర్గం గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ వస్తుందా? లేదా? అన్నది కూడా సందేహమే.

బాబు మాత్రం….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫర్మ్ గా ఉన్నారు. పార్టీని మోసం చేసిన వారిని ఉపేక్షించేది లేదని ఇటీవల తరచూ నేతలతో జరుపుతున్న సంభాషణల్లో చెబుతున్నారు. ఉత్తర నియోజకవర్గానికి ఇన్ ఛార్జిని కూడా త్వరలో నియమించే అవకాశాలున్నాయంటున్నారు. గంటా శ్రీనివాసరావు కూడా మరోసారి ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఆయన అలవాటు ప్రకారం మరో నియోజకవర్గానికి మారే అవకాశం ఉంది.

జనసేనలో చేరతారా?

ఇక భీమిలి నియోజకవర్గానికి కూడా ఇన్ ఛార్జిని చంద్రబాబు నియమించేశారు. గంటా శ్రీనివాసరావు మాత్రం టీడీపీ, జనసేన కలుస్తాయని తెలియడంతో ఆయన జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈసారి జనసేన నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. గెలుపు అవకాశం ఉందంటేనే గంటా శ్రీనివాసరావు జనసేనలోకి వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News