Ganta : గంటాకు బాబు ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు చెక్ పెట్టినట్లే కన్పిస్తుంది. ఆయనకే ఆయన బంధువులకు కూడా చంద్రబాబు ఇక వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరన్నది స్పష్టమయింది. గంటాశ్రీనివాసరావు [more]

Update: 2021-10-09 06:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు చెక్ పెట్టినట్లే కన్పిస్తుంది. ఆయనకే ఆయన బంధువులకు కూడా చంద్రబాబు ఇక వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరన్నది స్పష్టమయింది. గంటాశ్రీనివాసరావు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ఆయనతో పాటు ఆయన వియ్యంకులు ఇద్దరూ కూడా అప్పట్లో గెలిచారు. ఒకరు భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, నెల్లూరు నుంచి నారాయణ గెలిచారు. వీరిలో నారాయణ మంత్రిగా కూడా ఉన్నారు.

పార్టీకి దూరంగా…..

గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనతో పాటు నారాయణ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. నారాయణది ప్రత్యేక పరిస్థితులు. ఆయన గంటా శ్రీనివాసరావు కు వియ్యంకుడు మాత్రమే కాకుండా చంద్రబాబుకు సన్నిహితుడు. కానీ గంటా శ్రీనివాసరావు మరో వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు మాత్రం పార్టీకి ఉపయోగం లేకుండా పోయారు.

ఆయనను తప్పించి….

దీంతో ఆయనను భీమవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు తప్పించారు. భీమవరం ఇన్ ఛార్జిగా తోట సీతారామలక్ష్మిని నియమించారు. అంటే గంటా వియ్యంకుడికి ఈసారి టిక్కెట్ లేదనే చెప్పాలి. గంటా శ్రీనివాసరావు కు కూడా టిక్కెట్ ఈసారి దక్కే ఛాన్స్ లేదు. పార్టీకి ఉపయోగపడని నేతలను భరించడం కష్టమని భావించిన చంద్రబాబు గంటా వియ్యంకుడిని పార్టీ పదవి నుంచి తప్పించారనే అంటున్నారు.

వియ్యంకుడికి నో ఛాన్స్….

భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు వరసగా రెండు సార్లు గెలిచారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. గంటా శ్రీనివాసరావు ఎటు వెళితే ఆయన అటు వెళతారన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఆయనకు చెక్ పెట్టినట్లు కనపడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉన్నా తోట సీతారామలక్ష్మి అయితే నమ్మకంగా ఉంటుందని ఆమెను చంద్రబాబు ఎంపిక చేసినట్లు కనపడుతుంది. ఇప్పటికే నారాయణను కూడా ఇన్ ఛార్జి పదవి నుంచి చంద్రబాబు తప్పించారు. టోటల్ గా చూస్తే గంటా శ్రీనివాసరావు ఫ్యామిలీ ప్యాక్ కు బాబు నో చెప్పేసినట్లే.

Tags:    

Similar News