Ganta : గంటా జంప్ కు ముహూర్తం ఫిక్స్?

ఉత్తరాంధ్రలో అంగ, అర్థబలం ఉన్న నాయకుడు ఎవరంటే ఠక్కున చెప్పేది గంటాశ్రీనివాసరావు పేరే. ఆయన రాజకీయాలను అంచనా వేసి మరీ పార్టీలు మారతారనే పేరుంది. మూడు సార్లు [more]

Update: 2021-10-24 13:30 GMT

ఉత్తరాంధ్రలో అంగ, అర్థబలం ఉన్న నాయకుడు ఎవరంటే ఠక్కున చెప్పేది గంటాశ్రీనివాసరావు పేరే. ఆయన రాజకీయాలను అంచనా వేసి మరీ పార్టీలు మారతారనే పేరుంది. మూడు సార్లు పార్టీ మారినా మంత్రి పదవి దక్కించుకోగలిగారు. ఏ పార్టీలో ఉన్నా కీలకంగా మారతారు. గంటా శ్రీనివాసరావు ఉన్నాడంటే పార్టీ నేతలకు కొంత ధైర్యం. అది కాదనలేని వాస్తవం. అలాంటి గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

టీడీపీలో ఉన్నా….

గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. తన రాజీనామా ఆమోదించి ఉప ఎన్నికలు జరిగితే తాను తిరిగి పోటీ చేయనని కూడా ఆయన ప్రకటించారు.

ఏడాదికాలంగా….

ఇదిలా ఉండగా గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో సెగ తగులుతుంది. పార్టీ అధిష్టానం కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. ఆయన వియ్యంకుడు రామాంజనేయులును కూడా భీమవరం ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించారు. దీంతో గంటాకు పొమ్మనకుండా పొగ పెడుతున్నారని అర్థమయింది. పార్టీ కార్యక్రమాలకు కూడా ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.

జనసేన అయితే…?

గంటా శ్రీనివాసరావుకు మెగా ఫ్యామిలీతో మంచి పరిచయాలున్నాయి. ప్రజారాజ్యం మాత్రమే కాకుండా వ్యక్తిగత సంబంధాలున్నాయి. జనసేనకు కూడా గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు వచ్చే ఎన్నికల్లో అవసరం. గంటా ఆలోచన ఏంటంటే తాను జనసేన నుంచి పోటీ చేస్తే టీడీపీ, జనసేన పొత్తు కుదిరినా తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అధికారంలోకి వస్తే జనసేన కోటాలో మంత్రి పదవి కూడా దక్కుతుందని భావిస్తున్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు జనసేన వైపు అడుగులు వేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Tags:    

Similar News