Ganta : అన్నీ బేరాలేనట.. గట్టోడు కదా మరి…?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఏవీ అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు కాని ఏపీ రాజకీయాలపై స్పష్టత [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఏవీ అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు కాని ఏపీ రాజకీయాలపై స్పష్టత [more]
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఏవీ అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు కాని ఏపీ రాజకీయాలపై స్పష్టత రాదు. తెలుగుదేశం పార్టీ, జనసేనల పొత్తు పై కూడా క్లారిటీ ఎన్నికలకు ఏడాది ముందే వస్తుంది. అయితే ముందుగా తన కుమారుడిని జనసేనలోకి పంపాలన్న ఆలోచనలో గంటా శ్రీనివాసరావు ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయంటున్నారు.
అన్ని పార్టీలూ…
గంటా శ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన ఇప్పటి వరకూ అనేక పార్టీలు మారినా గెలుపు అంటిపెట్టుకునే ఉంటుంది. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తాయి. అంగబలం, ఆర్థికంగా గట్టోడు కావడంతో గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యాపారంలో మంచి డిమాండ్ ఉంది. గంటా సరుకుకు బాగానే బేరాలు పలుకుతాయి. ఆయన కూడా తన డిమాండ్లను ముందు పెట్టి మరీ నెరవేర్చుకుంటారు.
ఏ పార్టీలోకి వెళ్లినా?
ప్రజారాజ్యంలోకి వెళ్లినప్పుడు, ఆ తర్వాత కాంగ్రెస్ కు మారినప్పుడు, అక్కడి నుంచి టీడీపీలోకి జంప్ చేసినప్పుడు తన సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకోవడం దగ్గర నుంచి మంత్రి పదవుల వరకూ గంటా శ్రీనివాసరావు ముందుగానే బేరమాడతారన్నది టాక్. అందుకే ఆయనకు ఎక్కువ మంది సన్నిహితులు రాజకీయంగా ఉంటారంటారు. విశాఖ కేంద్రంగా ఆయన ఉంటే రాజకీయ పార్టీకి అదనపు బలం చేకూరినట్లే.
అందుకే అలా…..
తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఒకవేళ గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇవ్వరు. చంద్రబాబు సయితం గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలి పట్ల మండిపడుతున్నారు. అందుకే జనసేనలోకి వెళ్లి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవిని చేపట్టవచ్చన్న ఆలోచన కూడా ఉంది. అందుకే ముందుగా తన వారసుడిని జనసేనలోకి గంటా శ్రీనివాసరావు పంపుతారంటున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండటంతో మరికొంత కాలం వెయిట్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చిన పవన్ కల్యాణ్ సభకు జనసమీకరణ చేయడంలో గంటా శ్రీనివాసరావు పాత్ర కూడా పరోక్షంగా ఉందంటున్నారు.