సైలెన్స్ తోనే చంపేస్తున్నాడుగా..?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ దిగ్గజం చంద్రబాబుకే కాకాగాగ్గాలు నేర్పిస్తున్నారు. బాబుది ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే చురుకుదనం అయితే గంటాది అసలు ఆవలింత ఎపుడు రావాలో, [more]

Update: 2020-08-21 06:30 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ దిగ్గజం చంద్రబాబుకే కాకాగాగ్గాలు నేర్పిస్తున్నారు. బాబుది ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే చురుకుదనం అయితే గంటాది అసలు ఆవలింత ఎపుడు రావాలో, మానాలో కూడా తెలిసిన నైజం. అందుకే రెండు దశాబ్దాల కాలంలోనే ఏపీలో అతి ముఖ్య నాయకుడిగా మారిపోయారు. ఇదిలా ఉండగా విశాఖలో పార్టీ పరిస్థితి మీద సమీక్ష నిర్వహించేందుకు చంద్రబాబు ఆన్ లైన్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి విశాఖ సిటీలో గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలలో గంటా శ్రీనివాసరావు తప్ప మిగిలిన ముగ్గురూ హాజరయ్యారు. అలా గంటా బాబుకు గట్టి ఝలక్ ఇచ్చేశారు.

డౌటే లేదా…..

గంటా శ్రీనివాసరావు గత ఏడాదిగా సైలెంట్ తోనే చంపేస్తున్నారు. ఆయన తన వైపేనని బాబు కాకిలెక్కలు వేసుకుంటున్న ప్రతీసారి తాను వేరు అని చెబుతూనే ఉన్నారు. ఇపుడు కూడా విశాఖలోని తమ్ముళ్లను తట్టిలేపే ప్రోగ్రాం బాబు చేపడితే దానికి గంటా శ్రీనివాసరావు గైర్ హాజరు అయ్యారు. దీన్ని చూసిన టీడీపీ నేతలు గంటా సైకిల్ దిగిపోయినట్లే. డౌటే లేదు అంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ఇలాంటి ఝ‌లక్కులు చాలానే పార్టీకి చూపించారు. ఆరు నెలల క్రిత్రం విశాఖకు బాబు వస్తే ఎయిర్ పోర్టులోనే గో బ్యాక్ బాబూ అంటూ వైసీపీ నినదిస్తే అంగబలం అర్ధబలం అన్నీ కలిగిన గంటా శ్రీనివాసరావు బాబుకు అండగా లేకుండా సైడ్ అయిపోయారు. ఏకంగా బాబు టూర్ కే నాడు డుమ్మా కొట్టారు.

అంటీ ముట్టక ……

ఇదే తీరున అసెంబ్లీ సమావేశాలు గత ఏడాది కాలంలో జరిగినపుడు ఏదో ఒక రోజు మొక్కుబడిగా సభకు వచ్చి గంటా శ్రీనివాసరావు వెళ్లిపోయేవారు. జగన్ సర్కార్ మీద కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నలు వేసినా విమర్శలు చేసినా గంటా మాత్రం సభలో మౌనమే నా మాట అంటూ వచ్చారు. ఇక చంద్రబాబుకు ఏ విధంగానూ ఆయన మాట సాయం చేయకుండా సభలో నాయకుడికి వైసీపీ నుంచి అవమానం జరుగుతున్నా పట్టనట్లుగానే ఉండిపోయేవారు. దీంతో బాబు కూడా పార్టీలో అలా ఉన్నా చాలు అనుకున్నారేమో తెలియదు కానీ గంటా శ్రీనివాసరావు ని చేరదీసే కార్యక్రమ‌మేదీ చేపట్టలేదని కూడా అంటారు.

వ్యూహమేనా…?

గంటా శ్రీనివాసరావు ఇపుడు అనాటాచ్డ్ ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తున్నారు. టెక్నికల్ గా అసెంబ్లీలో ఆయన టీడీపీ సభ్యుడు కానీ. ఆ పార్టీతో అన్ని బంధాలూ తెంపుకున్నారు. ఆయన వైసీపీలోకి చేరుతారు అని నిన్నటిదాకా వినిపించింది. ఇపుడు అది ఆగింది అంటున్నారు. ఇవాళ కాకపోయినా రేపు అయినా కూడా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు చూస్తారని ఆయన వర్గం అంటోంది. మరో వైపు బీజేపీ నుంచి కూడా ఆఫర్ ఉంది అంటున్నారు. మొత్తానికి గంటా పూర్తి ఓపెన్ మైండ్ తో ఉన్నారన్నది నిజం. ఆయనకు బాబు మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు కానీ టీడీపీ మళ్ళీ గెలుస్తుందా అన్న డౌట్ కారణంగానే పార్టీని వీడాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు బాబుకు ఆయన పార్టీకి రాం రాం అని నోటి వెంట మాట చెప్పకుండానే చెప్పేశారు. దీన్ని ఎవరికి తోచిన విధంగా వారు అర్ధాలు తీసుకోవచ్చునని టీడీపీలో వినిపిస్తున్న తాజా మాట.

Tags:    

Similar News