చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన గంటా ?
గంటా శ్రీనివాసరావును తక్కువ చేసి చూస్తూ వస్తున్న అధినాయకత్వానికి సరైన టైంలో మాజీ మంత్రి షాక్ ఇచ్చేశారు. గంటాను కనీసం పార్టీ కమిటీల్లో ఎక్కడా చంద్రబాబు పట్టించుకోలేదు. [more]
గంటా శ్రీనివాసరావును తక్కువ చేసి చూస్తూ వస్తున్న అధినాయకత్వానికి సరైన టైంలో మాజీ మంత్రి షాక్ ఇచ్చేశారు. గంటాను కనీసం పార్టీ కమిటీల్లో ఎక్కడా చంద్రబాబు పట్టించుకోలేదు. [more]
గంటా శ్రీనివాసరావును తక్కువ చేసి చూస్తూ వస్తున్న అధినాయకత్వానికి సరైన టైంలో మాజీ మంత్రి షాక్ ఇచ్చేశారు. గంటాను కనీసం పార్టీ కమిటీల్లో ఎక్కడా చంద్రబాబు పట్టించుకోలేదు. అదే సమయంలో సీనియర్ గా ఉన్న ఆయనను అసెంబ్లీలో ఉప నేతగా కూడా నియమించలేదు. ఇక ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా గంటా శ్రీనివాసరావు ఉండాలనుకున్నారు. ఆ గౌరవం కూడా దక్కలేదు. మొత్తానికి ఏమీ కాకుండా గంటాను చేసిన చంద్రబాబుకు సరైన సమయంలో గట్టిగానే మాజీ మంత్రి కౌంటర్
ఇచ్చారని అంటున్నారు.
ఇరుకున పడిన తమ్ముళ్ళు…..
రాజీనామా అన్న మాట వినడానికే ఇష్టపడరు చంద్రబాబు అంటారు. ఇక విశాఖ రాజధాని గా జనం ఒప్పుకోవడంలేదు అని చంద్రబాబు సహా తమ్ముళ్ళు వాదించారు. నాడు ఇదే రకమైన సవాల్ తో వైసీపీ ముందుకు వచ్చింది. విశాఖ జనం రాజధానికి కోరుకోవడం లేదు అని నిరూపించడానికి సిటీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి గెలవాలని వైసీపీ చేసిన సవాల్ ని బాబు సహా తమ్ముళ్ళు పట్టించుకోలేదు. ఇపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాబోతోంది. మరి దీని మీద గంటా శ్రీనివాసరావు ముందుకు దూకి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. విశాఖ సిటీలో ఉన్న మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేలా ఆయన ఇరుకుపడేశారని అంటున్నారు.
చిత్తశుద్ధి ఉందా ….?
ఇక తెలుగుదేశం అన్నీ ఉత్త మాటలే చెబుతుంది, చేతలకు వచ్చేసరికి చతికిలపడుతుంది అని విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇపుడు టీడీపీ ఎమ్మెల్యే అన్న ముద్ర లేకుండానే గంటా రాజీనామా చేసి బయటపడ్డారు. ఆయన విశాఖ ప్రజల సెంటిమెంట్ ఉక్కు కర్మాగారం అంటూ గట్టిగానే నిలబడ్డారు. మరి ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెలుగుదేశం పోరాడుతామని అంటొంది తప్ప రాజీనామాల ఊసుకు పోవడంలేదు. దాంతో గంటా శ్రీనివాసరావు రాజీనామా టీడీపీకి ఉలిక్కిపడేలా చేసింది అనే చెప్పాలి.
క్రెడిట్ పాయే…..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం చేయడాన్ని తప్పుపడుతూ తమ్ముళ్ళు గట్టిగానే గొంతు చించుకుంటున్నారు. అయితే వారు వైసీపీని కార్నర్ చేస్తున్నారు. జగన్ సర్కార్ ఫెయిల్యూర్ అని కూడా అంటున్నారు. ఇలా అధికార పార్టీని బదనాం చేసి తాము పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని పసుపు పార్టీ కొత్త ఎత్తులు వేస్తోంది. దానికి చెక్ చెబుతూ గంటా శ్రీనివాసరావు బయటకు రావడంతో టీడీపీ వ్యూహం మొత్తం రివర్స్ అవుతోంది. ఇంకో వైపు నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేయాలని గంటా భావిస్తున్నారు. రేపటి రోజున విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిగిపడినా కూడా దాని క్రెడిట్ మొత్తం గంటా శ్రీనివాసరావుకే పోతుంది. మరి గంటాను టీడీపీ ఏమీ కాకుండా చేసినందుకు చూసినందుకు ఇలా భారీ మూల్యమే చెల్లించుకుంటుందా లేక గంటా మావాడే అని చెప్పి మరీ మిగిలిన ఎమ్మెల్యే తమ్ముళ్లతో రాజీనామా చేయించి ఆయన వెంట నడుస్తుందా అన్నది చూడాలి.