అక్కడ వర్గం … ఇక్కడ కులం..మతం?

2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయం., ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు తమ అకాంక్షను ఢిల్లీ వీధుల్లో వినిపించాలని తహతహలాడుతున్న రోజులు. అప్పటికే [more]

Update: 2020-06-10 17:30 GMT

2010లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయం., ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు తమ అకాంక్షను ఢిల్లీ వీధుల్లో వినిపించాలని తహతహలాడుతున్న రోజులు. అప్పటికే విద్యార్ధులు., న్యాయవాదులు., ఉద్యోగులు విడతల వారీగా జంతర్‌మంతర్‌లో ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రం మీద రోజుకో రకంగా పోరాటాలు చేస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటీ సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయి. రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు., అభిప్రాయాలు., వివరాలు., గణంకాలు కుప్పలుతెప్పలుగా ఢిల్లీ చేరేవి. వాతావరణం వేడిగా ఉన్న సమయంలో, రెండు ప్రాంతాల మనుషుల మధ్య దూరం పెరిగిన సమయంలో జర్నలిస్టులు కూడా ఆ ఆందోళనల్లో భాగమయ్యారు.

ఎంపీ స్పాన్సర్ చేసి…..

పెద్ద సంఖ‌్యలో జర్నలిస్టులు జంతర్‌మంతర్‌., పార్లమెంటు స్ట్రీట్‌లో పోరాటానికి తరలి వచ్చారు. ఆ మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనానికి కూర్చున్న వేళ…, రెండు ప్రాంతాల మిత్రుల మధ్య వాడీవేడిగా డిస్కషన్‌తో భోజనాలు ముగిశాయి. ఇంటి దగ్గర నుంచి క్యారేజీ తెచ్చుకునే మిత్రుడు క్యాంటీన్లో భోజనం ముగించి మాతో బయటకు వస్తుంటే వరంగల్‌కు చెందిన ఓ మిత్రుడు ఎదురయ్యాడు. రైల్లో వచ్చారా..? అంటే లేదు హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్లో అన్నాడా మిత్రుడు…, బ్యూరోలకు ఫలానా ఎంపీ స్పాన్సర్‌ చేశాడని అతనే చెప్పాడు. రీజినల్‌ హెడ్స్‌లో బండి రవీందర్‌ ఒక్కడే రైల్లో వచ్చినట్లు గుర్తు.. బ్యూరోలను విమానంలో తెచ్చినాయనే మనోళ్లందరికి అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కదా అని మావాడు అడిగితే, అవతలి నుంచి ఠక్కున ఓ సమాధానం వచ్చింది. “విమానం టిక్కెట్లిచ్చాడు కదాని మాదిగోనింట్లో భోజనానికి పోతామా….! అన్నాడు”.

భోజనం చేసేందుకు కూడా…..

మాతో భోజనం ముగించి వస్తున్న ఇద్దరు తెలంగాణ మిత్రులు ఏం మాట్లాడలేదు. ఆ మాట అన్న వ్యక్తి వెనుకబడిన సామాజిక వర్గమే….. టీవీల్లో అతని కథనాలు చూసి అప్పటి వరకు ఉన్న అభిప్రాయం క్షణాల్లో మారిపోయింది. అతను వెళ్లిపోయాక మళ్లీ మా మధ్య చర్చ మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు లాంజ్‌లో స్టూడియో లైవ్‌లో కూర్చున్న ఎంపీ వేరే పార్టీ వారితో జరిగిన వాగ్వాదంతో మధ్యలో లేచి వెళుతూ వెళుతూ “పంది కూర తినే లంబాడీని అంబేడ్కర్‌ పార్లమెంటుకు తెచ్చిండు….. తర్వాత ఏమవుతాదో మాకు తెల్వదా… అనుకుంటూ., వాళ్లతో తనను ఎప్పుడు పిలవొద్దని పోయాడు. ఇక ఆంధ్రా ఎంపీల పోరాటం ఎప్పుడు వేరుగానే నడిచేవి…. బలమైన కూటమి నాయకత్వాన్ని మిగిలిన వాళ్ళు ఎన్నడూ ఒప్పుకోలేదు. వ్యతిరేకించలేదు. వాళ్ల అక్రోశం వాళ్లది….. ఇప్పుడు అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ ఉదంతం గురించి చూసి ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

Tags:    

Similar News