నాగబాబు అందుకే అలా అన్నారా?

నాగబాబు ఉన్నట్టుండి గాడ్సే దేశభక్తిని పొగడటం వల్ల ఎవరికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అంతకు మించి ఏమైనా అన్నదమ్ములు ఆశిస్తున్నారేమో అన్నదే సందేహం. నాగబాబు ట్వీట్ [more]

Update: 2020-05-20 09:30 GMT

నాగబాబు ఉన్నట్టుండి గాడ్సే దేశభక్తిని పొగడటం వల్ల ఎవరికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అంతకు మించి ఏమైనా అన్నదమ్ములు ఆశిస్తున్నారేమో అన్నదే సందేహం. నాగబాబు ట్వీట్ సొంతమని భావించలేం. ఇన్నాళ్లు గాడ్సే మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో ఓ సందేహం. ఇన్నేళ్లు అణిచి పెట్టుకున్నారు అనుకున్నా ఏ ప్రయోజనం ఆశించి ప్రకటన చేశారన్నది కూడా ఆలోచించాలి.

ఊరికే ట్వీట్ పెట్టారా?

నాగబాబు ఊరికే ట్వీట్ పెట్టి ఉండరు. అలాగని తొందరపడి ట్వీట్ చేశానని చెప్పినా ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే గాడ్సే ను పొగిడితే వివాదం తలెత్తుతుందని నాగబాబుకు తెలియంది కాదు. గాడ్సేను ప్రశంసించి వార్తల్లోకి ఎక్కాలనుకున్నారా? తాను చేసే టీవీ షోలకు క్రేజ్ తేవాలనుకున్నారో తెలియదు కాని నాగబాబు ఆ ట్వీట్ ఊరికే.. ఉబుసుపోక చేశామని మాత్రం ఎవరూ అనుకోరు.

ప్రభావం చూపుతుందని తెలిసినా…

నాగబాబు కేవలం నటుడే కాదు మెగాస్టార్ చిరంజీవికి, జనసేన అధినేత పవన్ కల్యాణ‌ కు సోదరుడు. జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు వ్యాఖ్యలు పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని తెలిసినా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీకి మరింత దగ్గరయి కీలంకగా మారాలనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. నాగబాబు వ్యాఖ్యలపై జనసేన క్యాడర్ నుంచే అసంతృప్తి వ్యక్తమయింది.

ప్రయోజనం ఏమిటి?

ఈ వ్యాఖ్యల వల్ల నాగబాబు బ్రదర్స్ కు లభించే ప్రయోజనం బీజేపీలో కొత్త రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కోవచ్చు. నాయకత్వ లేమి ఎదుర్కొంటున్న బీజేపీకి ఓ బలమైన సామాజిక వర్గ రాజకీయ ఆకాంక్షను జత చేయొచ్చు. మిగిలిన రాజకీయ పార్టీలు నాగబాబు మీద విరుచుకుపడితే వారికి హిందుత్వ పక్షాల మద్దతు లభిస్తుంది. దశాబ్దాలుగా దాచి పెట్టుకున్న వాదానికి బహిరంగ మద్దతు కల్పించేందుకు వారికి ఓ గొంతు లభించినట్టు అవుతుంది. అంచేత ఇంకాస్త బయట పడే వరకు మిగిలిన పక్షాలు మౌనంగా చూస్తూ ఉండటమే..

Tags:    

Similar News