నెల రోజుల్లోనే సీన్ మొత్తం మారిందే?

గోవా కరోనా ఫ్రీ స్టేట్ గా తొలుత నమోదయింది. దీంతో గోవా దేశంలో రికార్డులకెక్కింది. అయితే లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత గోవాలో కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-07-02 17:30 GMT

గోవా కరోనా ఫ్రీ స్టేట్ గా తొలుత నమోదయింది. దీంతో గోవా దేశంలో రికార్డులకెక్కింది. అయితే లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత గోవాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గోవాలో మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే కరోనా సామాజిక వ్యాప్తి మొదలయింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అంగీకరించడం విశేషం. గోవాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటుాన్నామని ప్రభుత్వం చెబుతున్నా కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన మొదలయింది.

కరోనా ఫ్రీ రాష్ట్రంగా…

నిజానికి గోవా రాష్ట్రం కరోనా ఫ్రీ రాష్టంగా నమోదయింది. తొలి మూడు విడత లాక్ డౌన్ లతోనే గోవా కరోనా రహిత రాష్ట్రంగా నమోదయింది. అయితే మూడో విడత లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులతో తిరిగి కరోనా తిరగబెట్టిందన్నది వాస్తవం. గోవాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నది నిపుణులు తమ అధ్యయనంలో వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల నుంచి….

దీంతో గోవాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేకపోయినా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోవా ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను గుర్తించి కంటెయిన్ మెంట్ జోన్లుగా గుర్తించింది. వాటిలో మాంగోరి హిల్, మోర్లెం ప్రాంతాలను గోవా ప్రభుత్వం కంటెయిన్ మెంట్ జోన్లుగా ప్రకటించింది.

మరోసారి లాక్ డౌన్ తప్పదా?

గోవా మే చివరి వరకూ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఇప్పటికే గోవాలో దాదాపు 1100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్ కేసులు దాదాపు 700 వరకూ ఉన్నాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా గోవాలో ఇద్దరు మాత్రమే మరణించారు. దీంతో మరోసారి లాక్ డౌన్ ను అమలు పర్చే దిశగా గోవా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం మీద నెల రోజుల్లోనే గోవాలో సీన్ మొత్తం మారిపోయింది.

Tags:    

Similar News