గీత సెంటిమెంట్ మారుస్తారా ?

ఆమె కుటుంబానికి రాజకీయం కొత్త కాదు. ఆమె తండ్రి గొడ్డేడి దేముడు సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. గిరిజనులకు నిజంగా ఆయన దేముడే. అయితే ఆమె మాత్రం [more]

Update: 2020-04-26 15:30 GMT

ఆమె కుటుంబానికి రాజకీయం కొత్త కాదు. ఆమె తండ్రి గొడ్డేడి దేముడు సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. గిరిజనులకు నిజంగా ఆయన దేముడే. అయితే ఆమె మాత్రం అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉపాధ్యాయురాలిగా ఉంటూ తన జీవితం తాను చూసుకుందామనుకున్నా ఆమె అనుకోకుండా వైసీపీలో చేరడం, బలవంతంగానే అరకు ఎంపీ సీటుకు పోటీ చేయడం జరిగింది. ఇక మంచి మేజారిటీతో ఆమె గెలవడమే కాదు, కేంద్ర మంత్రిగా పనిచేసి రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న కిషోర్ చంద్రదేవ్ నే ఓడించేసారు. ఆమె వయసు పాతికేళ్ళు. కిషోర్ రాజకీయ అనుభవం దానికి రెట్టింపు. అయినా ఇది ప్రజాస్వామ్య రాజకీయం కాబట్టి ఇది సాధ్యపడింది. ఇలా అరకు ఎంపీగా పార్లమెంట్ లో పిన్న వయస్కురాలిగా గొడ్డేటి మాధవి ముద్ర వేసుకున్నారు.

ఆదిలోనే…..

గొడ్డేటి మాధవి ఇలా ఎంపీ అయ్యారో లేదో అలా ఆమెకు ఓ భారీ ఆఫర్ తలుపు తట్టింది. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా మాధవిని నియమిస్తామని వైసీపీ అధినాయకత్వాన్ని బీజేపీ పెద్దలు అప్పట్లో సంప్రదించారని అంటారు. అయితే బీజేపీ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకోవడంతో అది సాధ్యపడలేదు. లేకపోతే ఆమె కీర్తి జాతీయ స్థాయిలోనే వెలిగిపోయేది. ఆ తరువాత ఆమె పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నారు.

పట్టు పడితేనే….?

రాజకీయంగా గొడ్డేటి మాధవికి అంతా కొత్త ఆమె అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అయ్యారు కానీ ఇంకా పట్టు సంపాదించుకోలేదని అంటారు. ఆమె వైసీపీ నేతలను కూడా కలుపుకుని పోవడంలేదు. ఆమెకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి పొత్తు కుదరడంలేదు. ఇక మరో ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణతో కూడా సమన్వయం లేదు. మొత్తం తన పరిధిలోని నియోజకవర్గాలను ఆమె పూర్తిగా తిరగలేదు. అయితే కొంత నయం ఏంటంటే ఆమె ఏజెన్సీ ముఖద్వారం నర్శీపట్నంలోనే ఉండడం. ఇపుడిపుడే గొడ్డేటి మాధవి రాజకీయంగా పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు ఉందని అంటున్నారు. ఆయన సలహా సూచనలతో ఆమె ముందుకు అడుగులు వేస్తున్నారు.

రాత తిరగరాయాలి…..

అరకు అంటే చాలు వైసీపీకి వణుకు పుడుతోంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా కొత్తపల్లి గీతను గెలిపిస్తే ఆమె గెలిచి రెండు నెలలు తిరగకుండానే పాటీని వీడి టీడీపీకి జై కొట్టారు. ఇక నాటి అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు కూడా రెండేళ్లు ఆగి సైకిలెక్కేశారు. ఇపుడు గొడ్డేటి మాధవి నెగ్గారు. ఆమె వెనక బలం అంతా వైసీపీదేనని గుర్తు పెట్టుకోవాలి.తాను కూడా పార్టీలో బలపడాలి. జనంలో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి. అదే జరిగితే ఆమెకే మరోసారి వైసీపీ ఎంపీ టికెట్ దక్కే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ టికెట్ సంపాదించి గెలిచి రెండవమారి పార్లమెంట్ లో అడుగుపెట్టినపుడే గొడ్డేటి మాధవి అసలైన విజయం సాధించినట్లు అంటున్నారు. మరి ఆ దిశగా అరకు ఎంపీ అడుగులు పడతాయా. చూడాలి.

Tags:    

Similar News