అందుకేనా బుచ్చన్న…?
టీడీపీలో ఒక పరాజయం తర్వాత అనేక సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీకి అండగా ఉంటారని భావించిన సీనియర్లంతా.. కూడా రిటైర్మెంట్ బాటలో నడుస్తున్నారు. అనంతపురంలో పరిటాల [more]
;
టీడీపీలో ఒక పరాజయం తర్వాత అనేక సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీకి అండగా ఉంటారని భావించిన సీనియర్లంతా.. కూడా రిటైర్మెంట్ బాటలో నడుస్తున్నారు. అనంతపురంలో పరిటాల [more]

టీడీపీలో ఒక పరాజయం తర్వాత అనేక సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పార్టీకి అండగా ఉంటారని భావించిన సీనియర్లంతా.. కూడా రిటైర్మెంట్ బాటలో నడుస్తున్నారు. అనంతపురంలో పరిటాల సునీత, జేసీ వర్గం, కర్నూలులో కేఈ వర్గం ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక, ఉత్తరాంధ్రలోనూ కీలక నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీ భవితవ్యం ఏంటి? సైకిల్ చక్రాలు ముందుకు కదులుతాయా? లేదా అనే సందేహం తెరమీదికి వస్తోంది. దీనిపై ఇప్పటికే తర్జన భర్జనలు పడుతున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. ఎలాగైనా సీనియర్లను రంగంలోకి దింపాలని ఆయన యోచిస్తున్నారు.
బుచ్చన్న ప్రకటనతో….
ఇంతలోనే మరో సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక, పార్టీ పరిస్థితి ఏంటనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పొలి ట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న బుచ్చయ్య తనకు పార్టీలో పెద్దగా గుర్తింపు లేదని గత కొన్నాళ్లుగా అసహనం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయతే, చంద్రబాబు ఆయనను లైట్‌గా తీసుకున్నారు. దీంతో ఆయనకు కేబినెట్‌లో కనీసం ఏ మంత్రి పదవో లేదా నామినేడెట్ పదవో కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
పోటీ చేయబోనని….
ఈ నేపథ్యంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా. . తనలోని అసంతృప్తినీ, నిర్వేదాన్ని మాత్రం దాచుకో లేక పోతున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశాలకు వచ్చిన బుచ్చయ్య ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉండబోనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పార్టీలో వ్యూహకర్తగా ఆయన ముందున్నారు. ఇటీవల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ ప్రభంజనం సృష్టించినా.. ఎందరో మంత్రులు కాడి పడేసినా.. బుచ్చయ్య మాత్రం మరోసారి వరుస విజయం సాధించారు.
ఆ ప్లేస్ ఎవరిది…?
అలాంటి నాయకుడు ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో వచ్చే ఎన్నికల తర్వాత అదే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ తెరమీదికి వస్తోంది. వాస్తవానికి మిగిలిన నాయకుల మాదిరిగా బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు తన వారసుడు లేదా వారసురాలు అంటూ ఎవరినీ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఆయన కుటుంబం కూడా రాజకీయాలకు దూరంగా ఉంటోంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం టౌన్, రూరల్ నియోజకవర్గాల్లో పార్టీ పుట్టినప్పటి నుంచి బుచ్చయ్య కనుసైగల్లోనే టీడీపీ రాజకీయం నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పాలిటిక్స్‌కు దూరమైతే పార్టీకి ఆ స్థాయి నేతను అక్కడ భర్తీ చేయడం సవాల్ లాంటిదే. ఈ నేపథ్యంలో బుచ్చయ్య ప్లేస్‌ను చంద్రబాబు ఎవరికి ఇస్తారో ఆసక్తిగా మారింది.