Gorantla : అదే జరిగితే గోరంట్ల టిక్కెట్ చిరిగినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే కన్పిస్తుంది. పోటీ చేయాలనుకుంటున్న నేతలు జనంలోకి వస్తున్నారు. ప్రధాన సమస్యలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా జనసేన, టీడీపీ కలయిక పైనే [more]

Update: 2021-11-05 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే కన్పిస్తుంది. పోటీ చేయాలనుకుంటున్న నేతలు జనంలోకి వస్తున్నారు. ప్రధాన సమస్యలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా జనసేన, టీడీపీ కలయిక పైనే చర్చంతా జరుగుతుంది. జనసేన నేతలను ఇప్పటి నుంచే కొందరు మాజీ ఎమ్మెల్యేలు మంచి చేసుకుంటున్నారు. వారు చేపట్టే ఆందోళనకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. జనసేన బలంగా ఉన్న ప్రాంతంలో మాత్రం టీడీపీ నేతలు కొంత ఇబ్బందిపడుతున్నట్లే కన్పిస్తుంది. వీరిలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు.

నాలుగు దశాబ్దాలుగా…

గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నేత గత నాలుగు దశాబ్దాలుగా రాజమండ్రి రాజకీయాలను శాసిస్తున్నారు. ఆయన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి అనేక సార్లు గెలిచారు. రూరల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ జనసేనకు బలమైన నేత ఉన్నారు. జనసేనలో కీలక నేతగా ఉన్న కందుల దుర్గేష్ జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

పొత్తు కుదిరితే…?

జనసేన, బీజేపీ మైత్రి కుదిరితే ఈ నియోజకవర్గాన్ని జనసేన ఖచ్చితంగా పొత్తులో భాగంగా తీసుకుంటుంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి కావడంతో దానిని వదులుకోదు. అదే సమయంలో ఇటు సీనియర్ నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా టీడీపీకి అవసరమే. ఆయనను రాజమండ్రి అర్బన్ కు పంపాలన్నా అక్కడ ఆదిరెడ్డి కుటుంబం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడం సాధ్యం కాదు.

పెద్దల సభ హామీతో….

దీంతో వచ్చే ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నియోజకవర్గమన్నది లేకుండా పోతుందంటున్నారు. ఇప్పటికే ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఆయన వారసుడి కోసం కొంత ప్రయత్నం చేసినా రాజకీయాలకు దూరం అవుతారనే భావిస్తున్నారు. కానీ పార్టీ మాత్రం అందుకు అంగీకరించదు. వచ్చే ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సేవలను ఉపయోగించుకోవాలనుకుంటుంది. అయితే ఎన్నికలలో పోటీ చేయకపోయినా అధికారంలోకి వస్తే బుచ్చయ్యను పెద్దల సభకు పంపుతామన్న హామీ అధిష్టానం నుంచి లభించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News