అందుకేనా గోరంట్ల కఠిన నిర్ణయం …?
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్ఖర్లేని పేరు. పార్టీకి ఎమ్యెల్యే పదవికి సైతం గుడ్ బై కొట్టేయాలని గోరంట్ల డిసైడ్ కావడం తెలుగుదేశం పార్టీలో [more]
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్ఖర్లేని పేరు. పార్టీకి ఎమ్యెల్యే పదవికి సైతం గుడ్ బై కొట్టేయాలని గోరంట్ల డిసైడ్ కావడం తెలుగుదేశం పార్టీలో [more]
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్ఖర్లేని పేరు. పార్టీకి ఎమ్యెల్యే పదవికి సైతం గుడ్ బై కొట్టేయాలని గోరంట్ల డిసైడ్ కావడం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలే సృష్టిస్తుంది. అధినేత చంద్రబాబు, కాబోయే అధినేత నారా లోకేష్ లు గోరంట్ల ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడం ఒక్కటే కాదు పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్వేదానికి రీజన్స్ గా తెలుస్తుంది.
కావాలని రెండుసార్లు….
కావాలని రెండుసార్లు పక్క నియోజకవర్గంలో పోటీ చేయించి బలవంతంగా పార్టీనుంచి తప్పించాలని అధిష్టానం వేసిన ఎత్తుగడలను తన వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచి తిప్పికొట్టారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యేగా ప్రస్తుతం ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగి చంద్రబాబు పార్టీని స్వాధీనం చేసుకున్నాకా కోరుకున్న స్థానం దక్కక అసంతృప్తి తోనే రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారనే చెప్పాలి.
బాబు ధోరణి తోనే…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలాకాలంగా చంద్రబాబు ధోరణి పార్టీకి ప్రమాదకరంగా మారిందని అప్పుడప్పుడు బాహాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఆయన కు పార్టీ ద్రోహం చేసిందనే చెప్పాలి. ఈ రెండు సార్లు రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ ఇవ్వడానికి కూడా అధిష్టానం చాలా ఇబ్బందులు సృష్ట్టించింది.
ఆరుసార్లు గెలిచినా…?
ఏడుసార్లు రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రూరల్ నుంచి రెండు సార్లు విజయం సాధించి ఆరుసార్లు మొత్తంగా ఎమ్యెల్యే అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పౌరసరఫరాల మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన పార్టీలో అధ్యక్షుడు తప్ప ప్రస్తుత పాలిట్ బ్యూరో మెంబర్ తో సహా చూస్తే అన్ని పదవులు చేపట్టినట్లే. ఎప్పుడు పార్టీ అభివృద్ధి కోసం అధినేతను సైతం ధిక్కరించే స్వభావమే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మరోసారి మంత్రి పదవులు దక్కకుండా చేసింది.