పాపం.. గోరంట్ల మాధవ్..!

గోరంట్ల మాధవ్.. పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్. తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించారనే పేరు సంపాదించారు. తాను పనిచేసిన చోట్ల ప్రజల మన్ననలు పొందారు. [more]

Update: 2019-03-24 05:00 GMT

గోరంట్ల మాధవ్.. పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్. తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించారనే పేరు సంపాదించారు. తాను పనిచేసిన చోట్ల ప్రజల మన్ననలు పొందారు. పోలీస్ అధికారుల సంఘం నేతగా… పోలీసులను తిట్టిన అధికార ఎంపీపైకే మీసం మెలేసి.. నాలుక కోస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికార పార్టీకి, ప్రత్యేకించి కొందరు నేతలకు ఆయనపై కక్ష పెరిగింది. ఆయనకు కూడా ప్రజల్లో మంచి ఇమేజ్ వచ్చింది. రాజకీయాల్లోకి రావాలని ఆయన మొగ్గు చూపారు. దీంతో రెండున్నర నెలల క్రితం ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో టీడీపీకి అధికారికంగా ప్రత్యర్థిగా మారిపోయారు.

ఎంపీ టిక్కెట్ ఇచ్చిన జగన్

హిందూపురంలో బీసీలకు టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్న జగన్ కు గోరంట్ల మంచి చాయిస్ గా కనిపించారు. దీంతో ఆయనకు ఈ ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు టిక్కెట్ దక్కింది. అన్నీ కలిసొచ్చి విజయం సాధిస్తే ఓ సాధారణ సీఐ పార్లమెంటులో అడుగుపెట్టిన కీర్తి గడించేవారు. ఓ బీసీకి రాజకీయంగా మంచి అవకాశం దక్కేది. అయితే, పోటీకి సిద్ధమవుతున్న ఆయనకు ప్రభుత్వం నుంచే అడ్డంకులు వచ్చాయి. ఆయన రాజీనామా ఆమోదించలేదు. ఆయన రిలీవ్ కాకముందే నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ చెల్లదు. దీంతో ఆయన తనను రిలీవ్ చేయాలని పోలీస్ శాఖ అధికారులను కోరారు. ఏవో కారణాలతో ఆ ఫైల్ ముందుకు కదలలేదు. ఓ వైపు నామినేషన్లకు గడువు దగ్గరపడుతుంది. దీంతో చేసేదేమీ లేక ఆయన అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చింది. అయినా, ఓ ఉన్నతాధికారి అందుబాటులో లేనని చెబుతూ ఆయనను రిలీవ్ చేయడం లేదు.

కక్ష సాధిస్తున్నారంటున్న మాధవ్

దీంతో ఆయన ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈసీ కూడా ఆయనను రిలీవ్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. అయినా స్పందన లేదు. దీంతో చేసేదేమీ లేక గోరంట్ల మాధవ్ ప్రభుత్వ వైఖరికి నరసనగా నల్లచొక్కా ధరించి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టీడీపీ నేతలపై మీసం మెలేసిన ఆయనను పార్లమెంటులో అడుగుపెట్టనివ్వద్దని కొందరు చూస్తున్నారని, అందుకే తాను అవకాశం కోల్పోయేలా చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపిస్తున్నారు. పలువురి రాజీనామాలు వెంటనే ఆమోదించి టీడీపీ తరపున పోటీ చేయిస్తున్నారని, కానీ తనపై మాత్రం కక్ష సాధిస్తున్నారని వాపోతున్నారు. ఒక బీసీనైన తాను రాజకీయంగా ఎదుగుతానేమోనని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, మాధవ్ కాకపోతే ఆయన భార్య సవితకు టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించారు. కురబ సామాజకవర్గానికి చెందిన మాధవ్ కు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆ సామాజకవర్గ ప్రజల్లో మంచి ఆధరణ ఉంది. ఆయనను రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారనే భావన ఇక్కడి ప్రజల్లో వస్తోంది. దీంతో ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. మొత్తానికి, గోరంట్ల మాధవ్ పోటీ చేసినా, ఆయన భార్య పోటీ చేసినా వారికే మేలు జరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News