గోట్టిపాటి రాక ఖాయమే… షరతులన్నీ ఓకే

ప్రకాశం జిల్లాలోని కీల‌క‌మైన అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన గొట్టిపాటి ర‌వికుమార్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాల‌ని [more]

Update: 2020-08-09 02:00 GMT

ప్రకాశం జిల్లాలోని కీల‌క‌మైన అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన గొట్టిపాటి ర‌వికుమార్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాల‌ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ప్రయ‌త్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆయ‌న‌తో ఇప్పటికే అధికార పార్టీ కీల‌క నాయ‌కులు ట‌చ్‌లో ఉన్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా తాను పార్టీ మారేది లేద‌ని చెప్పిన గొట్టిపాటి ర‌వి ఇప్పుడు స‌రికొత్త ప్రతిపాద‌న‌తో ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి సీటును త‌న‌కే క‌న్‌ఫర్మ్‌ చేస్తే.. తాను పార్టీ మారేందుకు రెడీ అని ఆయ‌న చెప్పిన‌ట్టు వైఎస్సార్ సీపీలో చ‌ర్చసాగుతోంది.

వరసగా పార్టీలు మారినా….

గొట్టిపాటి ర‌వికుమార్ ప్రస్థానం కాంగ్రెస్‌లో ప్రారంభ‌మైంది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాక 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి నాలుగోసారి విజ‌యం సాధించారు. అయితే వైసీపీలో ఉన్నప్పుడు గొట్టిపాటి ర‌వికుమార్ కి జ‌గ‌న్ మంచి ప్రయార్టీ ఇచ్చారు. మంత్రి బాలినేనితో ఆయ‌న‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక గత ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ నుంచి సీనియ‌ర్ నేత బాచిన చెంచు గర‌ట‌య్య పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత క‌ర‌ణం బలరాం ఫ్యామిలీ వైసీపీకి ద‌గ్గర‌వ్వడంతో ఈ సీటును క‌ర‌ణం త‌న‌యుడు వెంక‌టేష్‌కు ఇవ్వాల‌ని పార్టీ భావించింది.

రవి సంకేతాలు పంపడంతో…

చీరాలను బ‌ల‌రాంకు అట్టేపెట్టి ఎప్పటి నుంచో అడుగుతున్న అద్దంకిని వెంక‌టేష్ కు ఇవ్వాల‌ని నిర్ణయించారు. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క‌ర‌ణం కుటుంబానికి అద్దంకిని ప‌రిమితం చేసి, చీరాల‌ను తిరిగి ఆమంచికే ఇవ్వాల‌ని అనుకున్నారు. అంటే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి ఎలాగూ పార్టీ లోకి రావ‌డం లేదు క‌నుక వెంక‌టేష్‌ను అక్కడ‌కు పంపాల‌ని తొలుత భావించారు. అయితే, ఇప్పుడు గొట్టిపాటి ర‌వికుమార్ తాను పార్టీలోకి వ‌చ్చేందుకు రెడీ అంటూ సంకేతాలు పంపారు. బాలినేని ఈ విష‌యంలో బాగా చొర‌వ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో వైఎస్సార్ సీపీ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది.

మూడు నియోజకవర్గాల్లో…..

చీరాల‌ను క‌ర‌ణం కుటుంబానికి వ‌దిలేసి.. ఇక్కడ ఉన్న ఆమంచిని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి పంపేయాల‌ని భావిస్తోంది. అదే స‌మ‌యంలో అద్దంకిని గొట్టిపాటి ర‌వికుమార్ కే ఇచ్చేస్తారు. ఈ ప‌రిణామాల‌పై చ‌ర్చించేందుకు క‌రణం వెంక‌టేష్‌ను తాడేప‌ల్లికి రావాల‌ని కూడా పార్టీ అధిష్టానం క‌బురు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. క‌ర‌ణం-గొట్టిపాటి ఫ్యామిలీలకు రాజీ కుదిర్చి.. ఆమంచిని ప‌రుచూరుకు పంపించి.. కీల‌క‌మైన బాధ్యత‌లు అప్పగించ‌డం ద్వారా ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాజకీయ స‌మీక‌ర‌ణ‌లు మార్చాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నట్టు స‌మాచారం. మ‌రి ఈ ఈక్వేషన్ల‌లో ఎవ‌రి రాజ‌కీయ భ‌విత‌వ్యం ఎలా మారుతుందో ? చూడాలి.

రవి పార్టీలోకి వస్తే…..

ఈ ప‌రిణామాలు మారితే రెండేళ్లుగా అద్దంకిని ఏలుతోన్న క‌ర‌ణం ఫ్యామిలీ అక్కడ బైబై చెప్పేయాలి. అదే స‌మ‌యంలో అద్దంకిలో ప్రతి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆట‌లో అర‌టి పండు మాదిరిగా మారుతోన్న బాచిన ఫ్యామిలీ మ‌రోసారి అదే అర‌టి పండు మాదిరిగా మిగిలిపోనుంది. ప్రస్తుతం అద్దంకి వైసీపీ ఇన్‌చార్జ్‌గా బాచిన గ‌ర‌ట‌య్య త‌న‌యుడు బాచిన కృష్ణ చైత‌న్య కొన‌సాగుతున్నారు. గొట్టిపాటి ర‌వికుమార్ పార్టీ మారితే చైత‌న్య సైడ్ అయిపోవాల్సిందే.

Tags:    

Similar News