గొట్టిపాటి గోడ దూకేస్తారా?

గొట్టిపాటి రవికుమార్…. ప్రకాశం జిల్లాలో యువనేత. అద్దంకిని గత కొంతకాలంగా ఏలుతున్న గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు సైలెంట్ గా మారిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేదా? అన్న [more]

Update: 2019-08-29 06:30 GMT

గొట్టిపాటి రవికుమార్…. ప్రకాశం జిల్లాలో యువనేత. అద్దంకిని గత కొంతకాలంగా ఏలుతున్న గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు సైలెంట్ గా మారిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేదా? అన్న సందేహం తలెత్తుతోంది. గొట్టిపాటి రవికుమార్ ఏక్షణమైనా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే ముఖ్య అనుచరులతో సమావేశమై గొట్టిపాటి రవికుమార్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

మూడుసార్లు… మూడు పార్టీలు….

గొట్టి పాటి రవికుమార్ మూడు సార్లు అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచారు. మూడుసార్లు మూడు పార్టీల నుంచి అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం గొట్టి పాటి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కరణం బలరాం పైన గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కరణం వెంకటేష్ మీద గెలుపొందారు. ఇక తాజాగా జరిగిన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గరటయ్య పైన విజయం సాధించారు.

టీడీపీలో చేరి…..

2014లో వైసీపీ గుర్తు మీద గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అప్పట్లో 23 మంది వైసీీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో గొట్టిపాటి ఒకరు. నారాలోకేష్ సూచన, చంద్రబాబు హామీతోనే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి వెళ్లారు. తన దీర్ఘకాల ప్రత్యర్థి కరణం బలరాం ను అద్దంకిలో లేకుండా చేయాలన్న ఏకైక కారణంతోనే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. నిజానికి గొట్టిపాటి రవికుమార్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైసీపీ నుంచి పార్టీ మారిన వాళ్లలో గొట్టిపాటి ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో గెలుపొందారు.

పార్టీకి దూరంగా……

2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి దూరం జరుగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని తెలిసింది. అసెంబ్లీ సమావేశాలకూ పెద్దగా హాజరయింది లేదు. గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే కొందరు వైసీపీ పెద్దలతో సంప్రదింపులు జరపుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పార్టీ లో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని షరతు పెట్టడంతో దీనిపై గొట్టి పాటి రవికుమార్ తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గొట్టి పాటి తన నిర్ణయం ప్రకటించే అవకాశముందని సమాచారం.

Tags:    

Similar News