వైసీపీలోకి అందుకే రారట
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ టీడీపీిని వీడేవరకూ ఊరుకునేలా లేరు. ఆయన వైసీపీలోకి వస్తే సేఫ్.. లేకుంటే వ్యాపారాలను దెబ్బ తీస్తామంటూ సంకేతాలను వైసీపీ ప్రభుత్వం [more]
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ టీడీపీిని వీడేవరకూ ఊరుకునేలా లేరు. ఆయన వైసీపీలోకి వస్తే సేఫ్.. లేకుంటే వ్యాపారాలను దెబ్బ తీస్తామంటూ సంకేతాలను వైసీపీ ప్రభుత్వం [more]
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ టీడీపీిని వీడేవరకూ ఊరుకునేలా లేరు. ఆయన వైసీపీలోకి వస్తే సేఫ్.. లేకుంటే వ్యాపారాలను దెబ్బ తీస్తామంటూ సంకేతాలను వైసీపీ ప్రభుత్వం బలంగానే పంపుతున్నట్లు కన్పిస్తుంది. గొట్టిపాటి రవికుమార్ ఎటూ ఊగిసలాటలోనే ఉన్నారు. అయితే వైసీపీలో చేరడం వల్ల తనకు అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏంటని ఆయన సందేహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి తన దీర్ఘకాల ప్రత్యర్థిని నియోజకవర్గం నుంచి బయటకు పంపించి వేసి తనకు నియోజకవర్గంలో తిరుగు లేకుండా చేసుకున్నారు.
తనకు ఎదురు లేకుండా…..
నిజానికి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో ఎదురు లేకుండా చేసుకునేందుకే గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు. టీడీపీలోకి వెళితే కరణం బలరాం కుటుంబానికి అద్దంకి నియోజకవర్గం నుంచి దూరం చేయవచ్చన్న ఆయన రాజకీయ ఎత్తుగడ ఫలించిందనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్ ను అద్దంకిలోనే ఉంచి కరణం బలరాంను చీరాలకు షిఫ్ట్ చేశారు. దీంతో గొట్టిపాటి రవికుమార్ కు నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా పోయింది.
జంప్ చేస్తే మళ్లీ కరణం….
ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉందని తాను జంప్ చేస్తే తిరిగి అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం వేలు పెట్టక మానరు. ఇప్పుడు కరణం బలరాం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇప్పటికీ ఆయనకంటూ ఒక వర్గం అద్దంకిలో ఉంది. కరణం వెంకటేష్ తాను పార్టీ మారిన వెంటనే అద్దంకిలో యాక్టివ్ అవుతారు. అందుకే గొట్టిపాటి రవికుమార్ అధికార పార్టీ నుంచి ఎన్ని వత్తిడులు వచ్చినా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచిస్తున్నారు. పార్టీ మారినందున తనకు మంత్రి ఛాన్స్ దక్కదు. అలాగే వైసీపీని కాదనుకుని వచ్చారు కాబట్టి ఆ పార్టీ అగ్రనాయకత్వం కిరీటం కూడా పెట్టదు.
విజిలెన్స్ దాడులు చేస్తున్నా…..
దీంతో గొట్టిపాటి రవికుమార్ టీడీపీని వీడటానికి కొంత సంశయిస్తున్నారు. చంద్రబాబుతో జరిగిన ఏకాంత సమావేశంలోనూ ఇదే విషయాలను ఆయనకు చెప్పినట్లు తెలిసింది. అయితే వైసీపీ సర్కార్ మాత్రం ఆయన వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ శాఖ తనిఖీలు చేస్తుంది. ఇలా అయినా దారికి వస్తారని వైసీపీ భావిస్తున్నట్లుంది. గొట్టిపాటి రవికుమార్ అసలు సమస్యను మాత్రం వైసీపీ పట్టించుకోవడం లేదు.