అప్పట్లోనూ.. ఇప్పుడూ అదే.. స‌మ‌స్య‌.. గొట్టిపాటి రూటు ఎటు?

రోజులు మారుతున్నాయ్‌. మ‌నం కూడా మారాల్సిందే. ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టిగా వినిపిస్తున్న మాట‌. తాజాగా ఇక్కడ ఎమ్మెల్యే , టీడీపీ నాయ‌కుడు గొట్టిపాటి [more]

Update: 2020-06-23 15:30 GMT

రోజులు మారుతున్నాయ్‌. మ‌నం కూడా మారాల్సిందే. ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టిగా వినిపిస్తున్న మాట‌. తాజాగా ఇక్కడ ఎమ్మెల్యే , టీడీపీ నాయ‌కుడు గొట్టిపాటి ర‌వి త‌న అనుచ‌ర‌ల‌తో భేటీ అయ్యారు. అత్యంత ర‌హ‌స్యంగా.. ఓ రిసార్టులో నిర్వహించిన ఈ కార్యక్రమం తాలూకు స‌మాచారం లీకైంది. పేరు చెప్పడానికి ఇష్టప‌డ‌ని అనుచ‌రులు కొంద‌రు అత్యంత విశ్వస‌నీయంగా వెల్లడించిన స‌మాచారాన్ని బ‌ట్టి.. ప్ర‌స్తుతం కొన్నాళ్లుగా గొట్టిపాటి ర‌వి.. తీవ్ర రాజ‌కీయ అల‌జ‌డిలో చిక్కుకున్నారు. ఆదిలో కాంగ్రెస్ నాయ‌కుడు.. త‌ర్వాత వైసీపీ నాయ‌కుడిగా మారి.. 2014లో వైసీపీ త‌ర‌పున విజ‌యం సాధించారు.

అప్పట్లోనూ టీడీపీ…..

అప్పట్లో ఆయ‌న వ్యాపారాల‌ను అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం గ‌ట్టిగా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆయ‌న చేసేదేం లేక టీడీపీలోకి జంప్ చేశారు. దీనికి కార‌ణం.. ఏ ప‌ద‌వులో ఆయ‌న ఆశించ‌లేదు. అప్పట్లోనూ ఆయ‌న మైనింగ్ కార్యక్రమాల‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోప‌డ‌మే కార‌ణం.. అప్పట్లోనూ గొట్టిపాటి రవికుమార్ ఈ కార‌ణంగానే వైసీపీ ని విడిచిపెట్టి.. టీడీపీకి జై కొట్టారు. దీంతో ఆయ‌న వ్యాపారం ముందుకు సాగిపోయింది. ఇక‌, ఆ త‌ర్వాత గొట్టిపాటి వ్యాపారాలు న‌ల్లేరుపై న‌డ‌క మాదిరిగానే మారాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్ కు ఆహ్వానం అందింది. వ‌చ్చేది మ‌న ప్రభుత్వమే.. అంటూ.. కొందరు ఆయ‌న‌కు రాయ‌బారాలు న‌డిపారు.

గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా….

అయితే గొట్టిపాటి రవికుమార్ ఎవ‌రి మాట‌లూ విన‌కుండా. టీడీపీలోనే ఉండిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ హ‌వా న‌డిచినా.. గొట్టిపాటి విజ‌యం సాధించారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల‌లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డుల‌కు ఎక్కారు. కానీ, రాష్ట్రంలో టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. 2014 త‌ర్వాత ఎలాంటి స‌మ‌స్య ఎదురు వ‌చ్చిందో.. ఇప్పుడు కూడా గొట్టిపాటికి అదే స‌మ‌స్య వ‌చ్చింది. గ‌నుల వ్యాపారంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గ‌త రెండు నెల‌ల్లోనే ఆయ‌న గ్రానైట్ వ్యాపారాల‌పై ఐదారు సార్లు దాడులు జ‌రిగాయి. ఇక ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మ‌రో గ్రానైట్ వ్యాపారి అయిన సిద్ధా రాఘ‌వ‌రావు ఇప్పటికే ఆయ‌న కుమారుడితో క‌లిసి పార్టీ మారిపోయారు.

మంత్రి రాయబారంతో…..

ఇక ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ వంతు వ‌చ్చింది. ఈ క్రమంలో ఆయ‌న‌పై సైతం పార్టీ మారాల‌నే ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. మార‌క‌పోయినా ఫ‌ర్వాలేదు.. టీడీపీని వ‌దిలేయాల‌నేది ప్రధాన డిమాండ్. దీనిపై ఇప్పటి వ‌ర‌కు టీడీపీ నేతల‌తో ఆయ‌న మంత‌నాలు జ‌రిపారు. ఇదే స‌మ‌స్యను ఎదుర్కొంటున్న కొంద‌రు నేత‌లు వైసీపీ పంచ‌న చేరిపోయారు. ఇప్పుడు తాను ఒక్కడుగా ఉండి పోరాడేది లేదు. పైగా వేధింపులు. అందుకే తాజాగా త‌న అనుచ‌రుల‌తో భేటీ అయిన గొట్టిపాటి రవికుమార్ ఏం చేద్దాం! అని వారితో చ‌ర్చలు జ‌రిపారు. ఈ క్రమంలోనే వారంతా వైసీపీ వైపే వేలు చూపించార‌ని విశ్వస‌నీయ స‌మాచారం. మొత్తానికి రేపో .. మాపో. గొట్టిపాటి రవికుమార్ సైకిల్ దిగిపోవ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవ‌హారంలో ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన ఒక మంత్రి కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌.

Tags:    

Similar News