ఏపీలో రేపటి నుంచి ఇక్కడ లాక్ డౌన్ ను లేపేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను సడలిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను సడలిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంక్షలను సడలిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర వస్తు ఉత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపును ఇచ్చారు. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు మినహాయింపులను ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం కల్పించారు. రైస్ మిల్లులు, పప్పు మిల్లులు, పిండిమరలు, డెయిరీ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు రేపటి నుంచి తెరుచుకునే వీలుంటుంది.
బేకరీలు, చాక్లెట్ల పరిశ్రమలు కూడా….
అలాగే ఆర్వో ప్లాంట్లు, ఆహోరోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ పరిశ్రమలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్ల తయారీ కంపెనీలు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలు, ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలకు రేపటి నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు కలెక్లర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ, రవాణా, కార్మికశాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు తెరిచినా కరోనా వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలను తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. పరిశ్రమలను నడుపుకునేందుకు ముందుగా జిల్లాల వారీగా ఆన్ లైన్ లో అనుమతి తీసుకోవాలన్న నిబంధనను విధించింది.